యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఆర్కె బీచ్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్‌ నుంచి రుషికొండ వరకు జరుగుతున్న యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహణతో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దాదాపు 3లక్షల 40వేల మందితో ఒకే ప్రాంతంలో యోగా నిర్వహించిన 22 ఐటమ్స్‌లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నామని.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధిగమించబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం. యోగాడే నిర్వహణ తర్వాత కూడా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. హ్యూమన్‌ యాంగిల్‌లో చెప్తున్నా తాను ఇప్పటివరకూ చేసిన ఈవెంట్లలో ఇదే గ్రేటెస్ట్‌ ఈవెంట్‌గా నిలిచిపోతుందన్నారు సీఎం చంద్రబాబు. యోగాను భావితరాలకు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం.

విశాఖలో యోగాంధ్ర కోసం ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్లు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. విశాఖలో ఐదు లక్షల మంది.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటున్నారు. ఇప్పటికే 2 కోట్ల 17 లక్షల మంది యోగా డేలో పాల్గొనేందుకు ఎన్‌రోల్ చేసుకున్నారని చెప్పారు సీఎం. ఈవేడుకల్లో నేవీ కూడా బాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అన్ని అనుకూలిస్తే ఆర్కే బీచ్ రోడ్డుతో పాటు ఏయూ గ్రౌండ్ లోను యోగ నిర్వహిస్తాం.. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏయూ మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఆల్టర్‌నేట్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొత్తం 326 కంపార్ట్మెంట్లలో ప్రతి కంపార్ట్మెంట్లో 1000 మందితో యోగా డే నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు యోగాంధ్ర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆర్కే బీచ్‌ నుంచి రుషికొండ వరకు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నోవాటెల్‌ లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష చేశారు. ప్రతిఒక్కరూ ఛాలెంజ్‌గా తీసుకొని యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు సీఎం. ఈనెల 21 అంతర్జాతీయ యోగా డేను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. 20వ సాయంత్రం భువనేశ్వర్‌ నుంచి విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆరోజు రాత్రి తూర్పు నావికాదళం గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 21న ఉదయం ఆరున్నర నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు ఆర్కే బీచ్‌ రోడ్‌లో యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

About Kadam

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *