రైల్వే స్టేషన్‌లో స్టార్ హోటల్‌ను మించి.. మ్యాటర్ తెలిస్తే ప్రయాణీకులు క్యూ కట్టేస్తారంతే

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే జర్నీ సౌకర్యవంతంగా ఉండాలి. అలసిపోయే ప్రయాణికుడికి కాస్త రిలాక్స్ కుదిరితే శారీరకంగా, మానసికంగా ఆ సంతృప్తే వేరు. ట్రైన్ దిగిన తర్వాత.. గమ్యస్థానానికి వెళ్లే ముందు గాని.. రైల్వే స్టేషన్‌కు వెళ్లి గంటల తరబడి రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు గానీ.. కాస్త విశ్రాంతి దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది. చాలామంది ప్రయాణికులు.. తమ జర్నీలో మిగిలిన సమయం కాస్త రిలాక్స్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అటువంటివారు ఫ్లాట్‌ఫార్మ్‌పై ఉన్న కుర్చీ పైనో.. లేక రిఫ్రెష్మెంట్ రూమ్‌లోకి వెళ్లి కాసేపు కూర్చుంటారు. ఇంకాస్త సమయం ఉంటే రైల్వే స్టేషన్‌కు సమీపంలోని హోటళ్లకు, లాడ్జిలకు వెళ్ళిపోతారు. కానీ వారికి ఆశించినంత సంతృప్తి దొరకదు. అటువంటి వారి కోసమే విశాఖ రైల్వే స్టేషన్ ఆహ్వానం పలుకుతుంది. స్టార్ హోటల్ రేంజ్‌లో నామినల్ ప్రైస్‌‌కు లగ్జరీలా సంతృప్తినిచ్చే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే చరిత్రలో తొలిసారిగా స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్యాప్సూల్ హోటల్ పేరుతో విశాఖ రైల్వే స్టేషన్‌లో రెడీ అయిన ఈ స్లీపింగ్ పాడ్స్.. అచ్చం రైలులోని ఏసి కోచ్‌లో ఉండే అనుభూతిని కలిగిస్తుంది. అది కూడా చాలా సరసమైన ధరలకు. ఇంతకీ ఈ క్యాప్సూల్ హోటల్ విశేషాలు ఏంటో తెలుసా.?

తక్కువ స్పేస్‌లో సౌకర్యవంతమైన విశ్రాంతి తీసుకునేందుకు విశాఖ రైల్వే స్టేషన్‌లో స్టార్ హోటల్ రేంజ్‌లో క్యాప్సూల్ హోటల్ ఆహ్వానం పలుకుతోంది. విన్నర్ స్లీపింగ్ పాడ్స్ అని కూడా అంటారు. విదేశాల్లో, అభివృద్ధి చెందే దేశాల్లో ఉండే ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ఇప్పుడు విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రైలు బోగీలో లగ్జరీ ప్రయాణం చేసినప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ రేంజ్‌లో పడకలను ఏర్పాటు చేశారు.

స్లీపింగ్ పాడ్స్ ప్రత్యేకతలు ఇవే..

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో తొలిసారిగా ఈ సౌకర్యం విశాఖ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వచ్చింది. రైలు భోగి, స్లీపర్ బస్సు తరహాలో ఏసీ బెర్త్స్ ఏ విధంగా ఉంటాయో ఆ రేంజ్‌లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వే కోచ్‌లో ఉండే అనుభూతి కలిగించేలా.. బెడ్స్‌ను తీర్చిదిద్ది.. ప్రైవసీకి కూడా ప్రాధాన్యతను ఇచ్చారు.

రైల్వే స్టేషన్‌లో ఎక్కడ.. దాని ధర ఎంత.. సౌకర్యాలు ఇవే..!

విశాఖ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్‌లో.. ఫస్ట్ ఫ్లోర్‌లో స్లీపింగ్ పాడ్స్‌ను తీర్చిదిద్దారు. ఏసీ సదుపాయం, ఫ్రీ వైఫై, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, స్నాక్స్, స్నానానికి హాట్ వాటర్, పర్యాటకులకు అవసరమైన సమాచారం అందించే స్పెషల్ డెస్క్, మోడ్రన్ వాష్ రూమ్ సదుపాయాలు ఉన్నాయి. 88 స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో సింగల్ బెడ్స్ 73, డబుల్ బెడ్స్ మరో 15, మహిళల కోసం ప్రత్యేకంగా 18 స్లీపింగ్ పాడ్స్‌ను సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. రెంట్ కూడా చాలా సరసమైన ధరల్లో ఉంచారు. సింగిల్ బెడ్‌కు మూడు గంటలకు ఒక్కొక్కరికి రూ. 200.. 24 గంటల వరకు ఒకరికి రూ. 400 వసూలు చేస్తున్నారు. డబుల్ బెడ్ అయితే.. మూడు గంటల వరకు రూ. 300, 24 గంటలకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.

‘ప్రయాణికులు పర్యటనకు సరసమైన, సౌకర్యవంతమైన వసతి అందించాలని సంకల్పించాం. విద్యా వైద్యం పర్యటకం కోసం వచ్చేవారి వసతికి డిమాండ్ ఉంది. చాలా సందర్భాల్లో ఉన్న వసతి గృహాలు ఖాళీగా లేకపోవడం, అధిక ధరలతో పాటు సౌకర్యవంతంగా లేకపోవడం లాంటి అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే బడ్జెట్ స్నేహపూర్వక వసతి కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం తీరుస్తుంది’ అని అన్నారు వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బోహ్రా.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *