భోజనానికి అన్నా క్యాంటిన్‌ వెళ్తున్నారా.. వారికి కండిషన్స్ అప్లై..!

ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్‌ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు.. ఇలా ఎంతో మంది పేదల ఆకలి తీర్చుతోంది అన్న క్యాంటిన్. జస్ట్‌ 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు.

మద్యం తాగి వస్తే ముద్ద పెట్టం.. ఇదీ ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లో ఓ అన్నా క్యాంటిన్‌ ముందు వెలసిన హెచ్చరిక బోర్డు..! ఇటీవల కొంతమంది వ్యక్తులు ఫూటుగా మద్యం సేవించి, అన్నా క్యాంటీన్లకు వచ్చి గొడవలకు దిగుతుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందట..! నిరుపేదలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ల ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తున్న మందుబాబులకు చెక్‌ పెట్టేందుకే ఇలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ హెచ్చరిక బోర్డులు ఒంగోలు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.

అన్నా క్యాంటీన్లు ఆన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ పధకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. డబ్బులు లేని నిరుపేదలు, యాచకులు, కూలీ పనులు చేసుకునే వ్యక్తులు ఈ అన్నా క్యాంటీన్లలో మధ్యాహ్నం భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు ఫూటుగా మద్యం సేవించి అన్నా క్యాంటిన్లకు వస్తున్నారు. తాగితే తాగారు, ఆ మద్యం మత్తులో అన్నం ఇంకా కావాలని, కూరలు వేయాలని డిమాండ్‌ చేస్తూ క్యాంటిన్‌ సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. వీరిని ఎలా కంట్రోల్‌ చేయాలో అర్ధంకాక క్యాంటీన్‌ నిర్వాహకులు ఓ ఫ్లాన్ చేశారు.

మద్యం సేవించి వస్తే టోకెన్‌ ఇచ్చేదీలేదంటూ హెచ్చరిక బోర్డులు పెట్టేశారు. అన్నా క్యాంటీన్‌ ప్రవేశ ద్వారం ముందు ఇలా బోర్డులు ఏర్పాటు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. మద్యం తాగి వచ్చేవారికి అన్నం పెట్టేదీ లేదని తెగేసి చెబుతున్నారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్న వాళ్ళు హోటల్‌కే వెళ్ళి తినాలని, పేదల కోసం 5 రూపాయలకే అన్నం పెడుతుంటే దీన్ని కూడా దుర్వినియోగం చేయడం మంచి పద్దతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు. నిజమే కదా.. మందుబాబులు ఆలోచించాలి..!

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *