ఓ వైపు తెలంగాణాలో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల వలన అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటువంటి విపత్కర పరిస్థితి సమయంలో దేవుడు దయ ఉండాలని భావించిన కొంతమంది భక్తులు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ సేవా సమితి పూజలు చేస్తున్న సమయంలో ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ పరంజ్యోతి భగవతి అమ్మవారి కంట కన్నీరు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కామారెడ్డి జిల్లాలోని పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడమంటూ అమ్మవారికి పూజలను నిర్వహిస్తున్న సమయంలో సాక్షాత్తు అమ్మవారి కంట్లో నుంచి కన్నీరు వచ్చిందని భక్తులు చెప్పారు. ఇదంటూ జగన్మాత మహిమే అని ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా గ్రామస్తులకు తెలియడంతో.. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
అంతేకాదు పరంజ్యోతి భగవతి కంట కన్నీరు వస్తున్న సమయంలో అంతవరకూ కామారెడ్డిలో కురుస్తున్న వర్షం.. హటాత్తుగా ఆగిపోయిందని.. ఇదంతా అమ్మవారి మహిమ.. అమ్మవారే తమని కాపాడారని భక్తులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే గణపతి విగ్రహం పాలు తాగడం, శివాలయంలో పాము ప్రత్యక్షం అవ్వడం వంటి అనేక రకాల వింత సంఘటలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మవారి కంట కన్నీరు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.