స్మశానం పక్కన ఆ కారులో వేగంగా వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా

తాడేపల్లి స్మశాన వాటిక వద్ద సగం కాలిన కారు పార్క్ చేసి ఉంది. దానిపై గ్రీన్ మ్యాట్ కూడా కప్పి ఉంది. అయితే అప్పటి నుంచి ఆ కారు నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. స్మశానవాటిక పక్కనే నివసించడం వారికి అలవాటు. స్మశానం పక్కనే ఉన్నా.. ఎప్పుడూ ఇంత ఆందోళనకు గురి కాలేదు. అయితే ఇప్పుడెందుకనుకుంటున్నారా..! సగం కాలిన కారును గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలిపెట్టి పోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఏదో జరుగుతోందన్న భయం కాలనీ వాసులను వెంటాడుతోంది.

దీంతో రాత్రి అయిందంటేనే బయటకు రావాలంటే ఆందోళనకు గురవుతున్నారు. చిన్న పిల్లలు, ఆడపిల్లల పరిస్థితి అయితే చెప్పలేం. ఇదంతా జరుగుతోంది ఎక్కడో మారుమూల పల్లెలలో కాదు. ఏపీ రాజధాని పక్కనే సీఎం, మాజీ సీఎం నివసించే ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న స్మశాన వాటిక వద్ద ఇది జరుగుతోంది. అయితే కాలనీవాసులు గుర్తు తెలియని వ్యక్తులు కారును పార్క్ చేసి వెళ్లినట్లు పోలీసులు చెప్పినా.. స్పందించలేదని అంటున్నారు.

స్మశానవాటిక పక్కనే కారును ఎందుకు వదిలిపెట్టారో అర్ధం కావడం లేదంటున్నారు. అది కూడా సగం కాలిపోయి ఉండటంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మూఢ నమ్మకాల భయం కూడా స్థానికులను వెంటాడుతోంది. ఈ సమయంలో పోలీసులు స్పందించి ఆ కారును పార్క్ చేసిన వారెవ్వరన్న సంగతి తేల్చాల్సి ఉంది. లేదంటే అక్కడ నుంచి ఆ కారును ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాలనీ వాసులు భయం తొలగిపోతుంది. లేదంటే దెయ్యం ఉందన్న ప్రచారం మరింత పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఆ కారు సంగతి తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.

About Kadam

Check Also

బైక్‌పై హెల్మెట్స్ లేకుండా చిక్కారో.. అవి కూడా వడ్డింపు.. అదీ లెక్క..

రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *