డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వెబ్‌ఐచ్ఛికాల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!

డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 26 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఉన్నత విద్యామండలి..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ వాయిదా పడింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 26 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంది. అయితే ఉన్నత విద్యామండలి తాజాగా రిజిస్ట్రేషన్ల గడువును ఆగస్టు 29 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వెబ్‌ఐచ్ఛికాల నమోదు తేదీలల్లో మార్పు వచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెబ్‌సైట్‌లో పెట్టింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు డిగ్రీ కోర్సులకు 1.56 లక్షల మంది అభ్యర్ధులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. మరోవైపు ఏఐసీటీఈ అనుమతితో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీసీఏ, బీబీఏ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27 ఇంజినీరింగ్‌ కాలేజీలకు బీబీఏ, బీసీఏ కోర్సులకు అనుమతులు వచ్చాయి. వీటిల్లో 19 కాలేజీలకే ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించింది. ఈ కోర్సులకు రూ.18 వేలుగా ఫీజు నిర్ణయించడంతో పలు ప్రైవేట్‌ కాలేజీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్‌ ఎస్సై ఎంపిక జాబితా విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

రైల్వే శాఖ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) సబ్ ఇన్‌స్పెక్టర్ తాత్కాలిక ఎంపిక జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగియగా.. ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు ఈ కింది పీడీఎఫ్‌ లింక్‌ ద్వారా నేరుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 452 సబ్ ఇన్‌స్పెక్టర్ నియామకాలకు గత ఏడాది మేలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. రాత పరీక్షలు గతేడాది డిసెంబర్‌లో నిర్వహించగా, పీఈటీ, పీఎంటీ, డీవీ పరీక్షలు మాత్రం జూన్‌ 22 నుంచి జులై 2 వరకు నిర్వహించింది.

అయితే తాజాగా విడుదలైన జాబితాలోని అభ్యర్థుల జోనల్ ప్రిఫరెన్స్ ఫారమ్‌లో పోస్టింగ్ కేటాయింపు కోసం వారి జోనల్ ప్రిఫరెన్స్‌ను ఇవ్వాలని సూచించింది. ఈ నోటీసు తేదీ వెలువడిన తేదీ నుంచి సరిగ్గా 7 రోజుల్లోపు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, జోన్ ప్రిఫరెన్స్‌ను పూరించి, దానిపై సంతకం చేసి, స్కాన్ చేసిన కాపీని digrt@rb.railnet.gov.inకు ఇమెయిల్ ద్వారా పంపాలని సూచించింది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.


About Kadam

Check Also

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !

అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *