ఫోన్లో అతిగా గేమ్స్‌ ఆడటం ఒక రోగం! డిజిటల్ గేమింగ్ అడిక్షన్‌ను వ్యాధుల జాబితాలో చేర్చిన WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డిజిటల్ గేమింగ్ అడిక్షన్‌ను ఒక వ్యాధిగా వర్గీకరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏకరీతి చికిత్సకు దారితీస్తుంది. ఈ వర్గీకరణ వల్ల పరిశోధన, కొత్త మందుల అభివృద్ధికి దోహదపడుతుంది. గేమింగ్ అలవాటు పెద్దలు, పిల్లలలోనూ పెరుగుతోంది కాబట్టి వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

డిజిటల్ రంగం ఎంతగా విస్తరిస్తుందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫాంపై పనిచేసే వారి సంఖ్య పెరగిపోయింది. అదే విధంగా యువత ఎద్ద ఎత్తున డిజిటల్ గేమింగ్ పట్ల ఆసక్తి చూపుతోంది. గంటల తరబడి మొబైల్, ట్యాబ్, ల్యాప్ ట్యాప్, కంప్యూటర్లకు అతుక్కుపోయి గేమ్స్ ఆడుతున్న వారి సంఖ్య అటు యువతలోనూ ఇటు చిన్నారుల్లోనూ పెరిగిపోతుంది. ఈ అలవాటును మాన్పించాలంటూ వైద్యులను ఆశ్రయిస్తున్న వారు ఎక్కువయ్యారు. అయితే ఇదే విషయాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్వో డిజటల్ గేమింగ్ అడిక్షన్ ను రోగాల జాబితాలో చేర్చింది. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకమైన వైద్య విధానాన్ని అవలంభించే అవకాశం ఉంటుందని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

గుంటూరు జింకానా ఆడిటోరియమ్ లో రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిజార్డర్ పై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో పాల్గొన్న ప్రముఖ సైకియాట్రిస్ట్ సమీర్ కుమార్ చెప్పారు. గేమింగ్ అలవాటు పిల్లలకే పరిమితం కాలేదని పెద్ద వాళ్లు దీని బారిన పడుతున్నారన్నారు. గేమింగ్ తో పాటు గ్యాంబ్లింగ్, సెక్సువల్ డిజార్డర్ నుండి రోగాలుగా చూడాల్సిందే అని తెలిపారు. ఈ అలవాట్ల తీవ్రతను గుర్తించిన డబ్ల్యూహెచ్ వో వీటిని వ్యాధుల జాబితాలో చేర్చించిందన్నారు. జాబితాలో చేర్చడం వలన ఈ రోగాలన్నింటికి ఒకే కోడ్ కేటాయిస్తారన్నారు. కోడ్ కేటాయించడం వలన ఎన్నో ఉపయోగాలుంటాయని తెలిపారు. కొత్తగా వైద్య వ్రుత్తిలోకి అడుగుపెడుతున్న వారంతా వీటి పట్ల అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

రిసెర్చ్ చేయడానికి, కొత్త కొత్త డ్రగ్స్ కనుక్కోవడానికి కూడా రోగాల జాబితాలో చేర్చడం ఉపయోగపడుతుందని మరొక వైద్యురాలు ఉమాజ్యోతి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వడంతో స్టాటిస్టికల్ డేటా కూడా ఏర్పడుతుందన్నారు. తద్వారా వైద్యులు సులభంగా రోగాన్ని గుర్తించి తగిన విధంగా వైద్యం అందిస్తారన్నారు. ఎవరైనా డిజిటల్ గేమింగ్ పట్ల అడిక్ట్ అయితే సిగ్గు పడకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక వైద్యం ఎంతో పురోగతి సాధించిందని ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ చికిత్స చేయించుకోవాలని సలహ ఇచ్చారు.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *