వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రావిన్స్‌ను ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ మహిళా ఫోరమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSTL డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్‌ను ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలోని సద్భావన హాల్‌లో వార్షిక కుటుంబ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ మహిళా ఫోరమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NSTL డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్, WMC ఇండియా రీజియన్ ఉమెన్స్ ఫోరం అధ్యక్షురాలు గీతా రమేష్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆంధ్రా మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమా నాయర్ సర్కార్, IMU అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రిఫత్ జనార్ధనన్, DSN లా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రిఫత్ ఖాన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టం వంటి సాంప్రదాయ నృత్య రూపాలతో పాటు జానపద సంగీతం, సోలో పాటలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అన్ని వయసుల వారు పాల్గొన్న ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. తన ఛారిటీ కార్యక్రమాలలో భాగంగా, WMC AP ప్రావిన్స్ ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు నాలుగు వీల్‌చైర్‌లను అందజేసింది.
అయితే గత సంవత్సరం ఏర్పడిన ఈవరల్డ్ మలయాళీ కౌన్సిల్ ఏపీ ప్రావిన్స్‌ను తక్కువ సమయంలోనే WMC ఇండియా రీజియన్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. గ్లోబల్ వైస్ చైర్మన్ దినేష్ నాయర్ ప్రకారం.. ఏపీ ప్రావిన్స్ వరల్డ్ మలయాళీ కౌన్సిల్‌కు కొత్తగా చేరినప్పటికీ, ప్రస్తుతం WMC ఇండియా రీజియన్‌లోని శక్తివంతమైన ప్రావిన్స్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈ సందర్భంగా WMC AP ప్రావిన్స్ కార్యదర్శి డాక్టర్ పికె జోస్ 2024-25 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దాతృత్వ సేవలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.