ప్రెగ్నెన్సీ టైమ్‌లో పొట్టపై దురద ఇబ్బంది పెడుతుందా? ఇలా చేస్తే చిటికెలో మాయం

తల్లి అవడం ప్రతి అమ్మాయికి ఓ అద్భుతమైన అనుభవం. ఆ సమయంలో పుట్టబోయే తన బిడ్డను తల్చుకుంటూ ఎంతో మురిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. దీంతో కంగారుపడిపోతుంటారు కాబోయే అమ్మలు. ముఖ్యంగా రోజులు గడిచేకొద్దీ పెరుగుతున్న పొట్టచుట్టూ విపరీతమైన దురద వేధిస్తుంది.. దీని నుంచి ఉపశమనం పొందాలంటే..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొంత మందికి అవగాహన లేకపోవడం వల్ల మరింత టెన్షన్స్ పడుతుంటారు. ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పొట్టపై దురద. అవును.. ఈ సమస్య చాలా మంది తల్లుల్లో కనిపిస్తుంది. నెలలు గడిచే కొద్దీ పొట్ట పెరిగిపోతుండడంతో కడుపుపై ఉన్న చర్మం క్రమంగా సాగుంది. దీంతో బంప్‌ చుట్టూ దురద పెడుతుంటుంది.

గర్భస్థ సమయంలో బిడ్డ ఎదుగుదలకు ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన మాంసాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కాబోయే తల్లి కూడా అంతేజాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వేసుకునే బట్టలపై కాస్త శ్రద్ధ పెట్టాలి. బిగుతుగా ఉండేవికాకుండా లూజ్‌గా, కంఫర్ట్‌గా ఉండేవి చూసుకోండి. కాటన్ బట్టలు ధరిస్తే మంచిది.

అలాగే కడుపుపై దురదగా ఉంటే గోర్లతో గోకడం వంటివి చేయకూడదు. బదులుగా అవకాడో ఆయిల్‌ వాడవచ్చు. ఇదులోని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల స్కిన్‌ మాయిశ్చరైజ్ అవుతుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ కూడా వాడవచ్చు. వీటిల్లో ఏదైనా ఒకటి కడుపు చుట్టూతా రాస్తే దురద తగ్గి ఉపశమనం లభిస్తుంది.

దురదగా ఉంటే ఓ గుడ్డని వేడినీటిలో ముంచి దానిని పొట్టపై వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కడుపు భాగమంతా రాసుకోవాలి. దీని వల్ల దురద ఎక్కువగా ఉండదు. సమస్య కూడా తగ్గి కడుపుపై చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

గర్భం దాల్చిన తర్వాత చాలా మంది వేడినీటితోనే స్నానం చేస్తుంటారు. కానీ, దీని వల్ల స్కిన్ డ్రై అయిపోయి పొడిబారుతుంది. దీంతో చర్మం దురదగా ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే చల్లని నీరు లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. స్నానం తర్వాత సువాసనలులేని మాయిశ్చరైజర్స్, లోషన్స్ రాసుకోవాలి. అలాగే స్పైసీ ఫుడ్స్, కెఫైన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. బదులుగా పండ్ల రసాలు వంటివి తీసుకోవాలి. సమస్య అధికంగా ఉండే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

About Kadam

Check Also

ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే..

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *