రజినీకాంత్‏ను కలిసిన చెస్ ఛాంపియన్ గుకేశ్‏.. ఆ పుస్తకం బహుమతిగా ఇచ్చిన సూపర్ స్టార్..

సూపర్ స్టార్ రజినీకాంత్ భారత యువ గ్రాండ్ మాస్టర్.. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేశ్‏ను సన్మానించారు. తన ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి తన ఇంటికి వచ్చిన గుకేశ్‏ను అభినందించారు తలైవా. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు గుకేశ్.

సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ఛాంపియన్‌షిప్‏లో విజేతగా నిలిచాడు గుకేశ్. 14వ గేమ్‏లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి భారత యువ చెస్ ప్రాడిజీ గుకేశ్ గతవారం చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అలాగే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత అదే టైటిల్‌ను సాధించిన రెండవ భారతీయుడు కూడా. ఈక్రమంలోనే సూపర్ స్టార్ రజినీ ఆహ్వానం మేరకు తన తల్లిదండ్రులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లిన గుకేశ్ తలైవాను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను గ్రాండ్ మాస్టర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తన కోసం తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు రజినీకాంత్ కు గుకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‏గా నిలిచిన గుకేశ్ ను శాలువాతో సన్మానించారు రజినీకాంత్. అలాగే అతడి పరమహంస యోగానందకు సంబంధించిన 1946 ఆధ్యాత్మిక క్లాసిక్ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ పుస్తకాన్ని బహుమతిగా అందించారు. అలాగే గుకేశ్ రజినీకాంత్ మాత్రమే కాకుండా అమరన్ సినిమాతో హిట్ అందుకున్న హీరో శివకార్తికేయన్ ను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. గుకేశ్ కు శివకార్తికేయన్ విలువైన చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజినీకాంత్ కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అలాగే శివకార్తికేయన్.. డైరెక్టర్ ఏఆర్ మురుగాదాస్, సుధా కొంగర డైరెక్షన్లలో వరుస ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

About Kadam

Check Also

వామ్మో హడలెత్తిస్తున్న మరో వైరస్.. GBS వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయంటే..

గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *