డ్రా గా ముగిసిన గబ్బా టెస్ట్‌.. డబ్ల్యూటీసీ టేబుల్‌లో కీలక మార్పులు.. టీమిండియా ఫైనల్ ఆడడం కష్టమే?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ చేరే జట్లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఫేవరేట్‌గా నిలిచిన భారత్.. ఒక్క ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, గబ్బా టెస్ట్ ఫలితం తర్వాత కూడా భారత జట్టుకు ఏమాత్రం లక్ దక్కలేదు. మరోవైపు ఆస్ట్రేలియా పాయింట్ల శాతంలోనూ కోత పడింది.

బ్రిస్బేన్‌లో వర్షం కారణంగా గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-1తో సమంగా నిలిచాయి. గబ్బా టెస్ట్ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే పీటీసీ శాతం 55.88కి పడిపోయింది. అదేవిధంగా, ఆస్ట్రేలియా పీటీసీ శాతం 58.89కి పడిపోయింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇక అగ్రస్థానం విషయానికి వస్తే దక్షిణాఫ్రికా జట్టు టాప్ లేపుతోంది. హామిల్టన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో శ్రీలంక కొనసాగుతోంది. అయితే, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిస్తే లంక టీం తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది.

WTC 2023-25 ​​పాయింట్ల పట్టిక..

ర్యాంక్జట్టుటెస్టులుగెలిచిందిఓడిపోయిందిడ్రాపాయింట్లుపీసీటీ శాతం
1దక్షిణాఫ్రికా106317663.33
2ఆస్ట్రేలియా1594210658.89
3భారతదేశం1796211455.88
4న్యూజిలాండ్147708148.21
5శ్రీలంక115606045.45
6ఇంగ్లండ్221110111443.18
7పాకిస్తాన్104604033.33
8బంగ్లాదేశ్124804531.25
9వెస్టిండీస్112723224.24

About Kadam

Check Also

12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగైన స్థితిలో ఉంటాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *