అధికారులకు జైల్లో ఫోన్ ఛార్జర్ కనిపించింది. ఎవరో మొబైల్ యూజ్ చేస్తున్నారని భావించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఏం దొరకలేదు. ఓ ఖైదీ ప్రవర్తన తేడాగా ఉండటంతో…
జైలు అంటే క్రిమినల్స్ ఉండే ప్లేస్. అక్కడ కట్టుదిట్టమైన భద్రత.. పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఎవరైనా లోపల ఉన్న తమ వాళ్లను ముందుస్తు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక జైల్లో ఖైదీలకు కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అయితే ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి జైలు అధికారులు కంగుతిన్నారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన తీరు చూసి అధికారులు కంగుతిన్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జైల్లో వెలుగుచూసింది.
రవి బరయ్య(33) అనే ఖైదీ పోక్సో కేసులో అరెస్ట్ అయి.. ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా జైల్లో ఉంటున్నాడు. జైలు లోపల ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ అనుమతి ఉండదు. అయితే డిసెంబర్ 4న తనిఖీల సమయంలో.. మొబైల్ ఫోన్ ఛార్జర్ కనిపించడంతో అధికారులకు డౌట్ వచ్చింది. ఖైదీలు అందరి వద్ద వెతికినా ఫోన్ దొరకలేదు. అయితే రవి బరయ్యపై అనుమానంతో అతడి సెల్ అంతా గాలించినా ఫోన్ దొరకలేదు. అయినా అతనిపై అనుమానం పోలేదు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి రవికి బాడీ ఎక్స్-రే తీయించారు. స్కానింగ్‌లో మల ద్వారంలో మొబైల్ ఉన్నట్లుగా తేలింది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు చేయగా.. BNS 223, ఖైదీల చట్టంలోని సెక్షన్ 42, 43, 45(12)ల కింద కేసు నమోదు చేశారు.
నిషేధిత మొబైల్ ఫోన్, ఛార్జర్ జైల్లోకి ఎవరు తీసుకొచ్చారు. రవి ఎంతకాలంగా ఫోన్ వినియోగిస్తున్నాడు అనే విషయాలపై జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.