మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఇటీవలే కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు. అయితే ఆయన కోలుకుని డిశ్చార్జి కావడంతో అంతా సంతోషించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్ల సూచనతో కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. షుగర్, సోడియం లెవల్స్‌లో తేడాలు ఉండడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు అంతా ఆందోళన చెందారు. అయితే షుగర్, సోడియం లెవల్స్ కంట్రోల్లోకి రావడంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జి చేశారు. అప్పటినుంచి కేసీఆర్ నందినగర్ నివాసంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం కొద్దిగా సెట్ అవ్వడంతో మరోసారి మెడికల్ టెస్టుల చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీశ్ రావు ఉన్నారు.
గతంలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా పార్టీ శ్రేణులతో కేసీఆర్ భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఆస్పత్రిలో జాయిన్ అయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.