అయ్యో భగవంతుడా.. ఇదేంటయ్యా..! చనిపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చినట్లు సమాచారం..

భవిష్యత్‌పై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు.. పోలీస్ అవ్వాలని.. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమై.. సక్సెస్ అయ్యాడు.. సీఆర్‌పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు.. మరికొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయనగా.. ఇంతలోనే విధి వంచించింది.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ (22) అనే యువకుడు తన తండ్రి బాలాజీతో కలసి సూర్యాపేట వెళ్ళి వస్తూ కూసుమంచి వద్ద రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. బైక్ పై వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మణిచంద్ర మృతి చెందగా.. తండ్రి బాలాజీ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ నెల 17 న మంగళవారం ఈ ఘటన జరిగి జరిగింది.. అయితే మణిచంద్ర పోలీస్, సీఆర్పీఎఫ్‌లో ఉద్యోగం సాధించాలని బాగా కస్టపడి ప్రిపేర్ అయ్యాడు. ఈవెంట్స్‌లో సెలెక్ట్ అయ్యాడు.. ఆ తర్వాత పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి.. రాశాడు.. ఎలాగైనా ఉద్యోగం వస్తుందని అందరితో చెప్పేవాడు..

అయితే.. మణిచంద్ర మరణించిన మరుసటి రోజే.. సీఆర్పీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి..ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు బుధవారం రోజు సమాచారం వచ్చింది. కానీ అప్పటికే కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..

తన జీవిత కల తీరేనాటికి మణిచంద్ర కనిపించకుండా పోయాడంటూ శోకసంద్రంలో మునిగిపోయారు కుటుంబసభ్యులు.. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *