సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ప్రతీ నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నా… ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని ఆయన అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ప్రతీ నెల ఒక అంశం తీసుకొచ్చి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదని జగన్ అన్నారు. ఆరు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన జరుగుతోందని.. చెక్‌పోస్టులు దాటి బియ్యం కాకినాడ పోర్టు వరకు ఎలా వస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ చెప్పారు.. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.. అంతేకాకుండా ప్రతీ రోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాంటూ మండిపడ్డారు.. చంద్రబాబు వచ్చిన తర్వాత బాదుడే బాదుడు మొదలైందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందని.. తమకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మళ్లీ అధికారంలోకి వస్తామంటూ జగన్ ధీమా వ్యక్తంచేశారు.
బురద చల్లే వారితో ప్రస్తుతం యుద్ధం చేస్తున్నామని.. అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారంటూ జగన్ పేర్కొన్నారు.. దాన్నీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలని.. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలంటూ వైసీపీ పార్టీ శ్రేణులకు జగన్ సూచనలు చేశారు.