కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి నిరంతర షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవులకు రాజీనామా చేసి జకియా ఖానుం వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తిరుమల దేవస్థానం VIP టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు, కూటమి నేతలతో జకియా సమావేశాలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్సీ వైసీపీకి దూరమయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవికి, ఎమ్మెల్సీకి పదవికి జకియా ఖానుం రాజీనామా చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానుం తన ఎమ్మెల్సీ పదవికి, మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
జకియా ఖానుం భర్త మరణం తర్వాత మాజీ సీఎం జగన్ ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మండలి చైర్మన్‌ను చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జకియా అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నారు అనే దానిపై కూడా జఖీయాఖానం పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జకియా టిడిపి నేత లోకేష్ ను కలవడం దగ్గర నుంచి కొంత వైసీపీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ను కలిశారు. వైసీపీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్న జకియా ఈరోజు తన పదవికి కూడా రాజీనామా చేశారు.
గత ఐదు సంవత్సరాలుగా తనకు రాజకీయంగా అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే వైసీపీ నుంచి బయటికి వచ్చిన ఆమె బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జకియాను పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పార్థసారథి కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే తాను బీజేపీలో చేరానని జకియా స్పష్టం చేశారు.