పైకి చూసి ఉత్తుత్తి చాక్లెట్లు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం.. ఇలా అందరూ డ్రగ్స్‌తో దొరికారో తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినా.. కేటుగాళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. న్యూఇయర్ వేళ భారీ ఎత్తున అక్రమంగా గంజాయి తరలిస్తూ.. ఆ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.

థర్టీ ఫస్ట్‌ రోజు లైన్‌ క్రాస్‌ చేస్తే తాటతీస్తాం. డ్రగ్స్‌ వాడారో దబిడిదిబిడే. అక్రమ మద్యంతో దొరికారా అంతుచూస్తాం అంటూ నిన్ననే సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ కేటుగాళ్లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న కంత్రిగాళ్ల ఆటకట్టించారు ఎక్సైజ్‌ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడలో గంజాయి ముఠా గుట్టురట్టుయింది. చాక్లెట్ల రూపంలో గంజాయిని తరలిస్తున్న కేటుగాళ్లును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.

గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని హైదరాబాద్ నుంచి కోదాడకు రోడ్డు మార్గంలో తీసుకెళ్తుండగా.. పక్కా సమాచారంతో ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరున్న 25 గంజాయి చాక్లెట్ల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఆ 25 బ్యాగుల్లో వెయ్యికిపైగా గంజాయి చాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. కాగా, ఈ ఘటనలో పోలీసుల ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. నిందితులు ఒడిశాకు చెందినవారిగా తెలుస్తోంది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Kadam

Check Also

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రాచకొండ సీపీ.. ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైనా ఓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *