UPI పేమెంట్లపై ఛార్జీలు.. యూజర్ల షాకింగ్ నిర్ణయం.. 75 శాతం మంది అదే చెప్పారట!

UPI Transactions: దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ పేమెంట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. కిరాణా దుకాణం నుంచి హాస్పిటల్స్ బిల్లుల వరకు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఎక్కుగా వాడుతోంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ పద్ధతే. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్, మొబైల్ నంబర్ ఉపయోగించి ఉచితంగా ఒకరి నుంచి మరొకరు డబ్బులు పంపించుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో చిల్లర సమస్యకు ఓ పరిష్కారం దొరికిందని చెప్పవచ్చు. రోజుకు కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్న క్రమంలో యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు చేస్తారనమే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై యూపీఐ యూజర్లు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే యూజర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై లోకల్ సర్కిల్స్ సర్వే నిర్వహించింది. జులై 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ మధ్య ఆన్‌లైన్ ద్వారా 308 జిల్లాల్లోని 42 వేల మంది నుంచి అభిప్రయాలు సేకరించింది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు ప్రశ్నకు 15,598 మంది రిప్లై ఇచ్చారు. ఛార్జీలు విధిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయడం ఆపేస్తామని దాదాపు 75 శాతం మంది వెల్లడించారని సర్వే తెలిపింది. 22 శాతం మంది మాత్రం ఛార్జీలు విధించినా పేమెంట్లు కొనసాగిస్తామని చెప్పారు. 37 శాతం మంది విలువ పరంగా చూసుకుంటే వారి మొత్తం పేమెంట్లలో 50 శాతానికి పైగా యూపీఐ ట్రాన్సాక్షన్ల ఖాతాల నుంచే ఉంటున్నట్లు తెలిపారు.

About amaravatinews

Check Also

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్‌గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *