మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వారంలో రూ.5000 డౌన్.. 

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5 వేలకుపైగా దిగిరావడం గమనార్హం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాతి రోజు నుంచి సైతం భారీగానే దిగివస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదు వేలకుపైగా పడిపోయాయి. బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. మరి హైదరాబాద్‌లో ఇవాళ జులై 27న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేటు..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2387 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. వారం రోజుల క్రితం ఇది 2450 డాలర్లపైన ట్రేడింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 27.96 డాలర్ల వద్ద ఉంది. రూపాయి మారకం విలువ గరిష్ఠ స్థాయిలోనే రూ.83.758 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ మరింత దిగివచ్చింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1090 మేర పడిపోయి రూ. 68 వేల 730 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1000 మేర పడిపోయి రూ. 63 వేలకు తులం పలుకుతోంది. ఇక ఢిల్లీలో చూస్తే 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ తులంపై రూ.1070 తగ్గి రూ. 68 వేల 880 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.1000 మేర పడిపోయి రూ. 63 వేల 150 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

స్థిరంగా వెండి ధర..

వరుసగా పడిపోతూ వచ్చిన వెండి ధర ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది. బడ్జెట్ రోజు నుంచి కిలో వెండి రూ.7000 మేర పడిపోయింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర స్థిరంగా రూ. 89 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు రూ.84 వేల 500 పలుకుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ట్యాక్సులు కలపలేదు. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్లలో ధరలు తెలుసుకోవడం మంచిది.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *