దశ తిప్పిన ఐపీఓ.. తొలిరోజే 100 శాతం పెరిగిన షేరు.. లిస్టింగ్‌తోనే చేతికి రూ. 2 లక్షలు!

VVIP Infratech IPO Listing Price: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. దీర్ఘకాలంలో మంచి లాభాల్ని అందుకోవచ్చు. మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు నష్టపోతాయో ముందే ఊహించడం కాస్త కష్టమే. అయితే.. మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని షేర్లు అదరగొడుతుంటాయి. వీటిల్లో ముఖ్యంగా ఐపీఓ ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. చాలా వరకు ఐపీఓలు అద్భుత ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్టవుతుంటాయి. ఇప్పుడు ఇలాగే ఒక ఐపీఓ ఎంట్రీ ఇచ్చింది. తొలిరోజే 100 శాతం వరకు ఇన్వెస్టర్లకు లాభాల్ని అందించడం విశేషం. అదే వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్. ఇది మంగళవారం రోజు BSE SME ఎక్స్చేంజీలో లిస్టయింది. సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్లకు లక్షల్లో లాభాలు వచ్చాయని చెప్పొచ్చు.

ఈ వీవీఐపీ ఇన్‌ఫ్రా కంపెనీ విషయానికి వస్తే ఇష్యూ ధర రూ. 93 గానే ఉండగా.. ఏకంగా 90 శాతం పెరిగి రూ. 176.70 వద్ద లిస్టయింది. ఇంకా అక్కడితోనే ఆగకుండా.. మళ్లీ అప్పర్ సర్క్యూట్ కూడా కొట్టేసింది. మరో 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 185.53 వద్దకు చేరింది. ఇక మార్కెట్ విలువ రూ. 11 కోట్లుగా నమోదైంది.

ఐపీఓ కోసం ముందుగా ఈ స్టాక్ ధరల శ్రేణిని రూ. 91 నుంచి రూ. 93 గా నిర్ణయించింది. ఇక్కడ ఫేస్ వాల్యూ రూ. 10 గా పేర్కొంది. ఇక ఇందులో కనీసం ఒక లాట్ కింద 1200 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే రూ. 93 ఇష్యూ ధర చొప్పున 1200 షేర్లకు రూ. 1200X 93 = రూ. 1,11,600 కనీస పెట్టుబడి అవుతుంది. ఇక లిస్టింగ్ ప్రైస్ అంటే రూ. 176.70 వద్ద చూసినట్లయితే.. చేతికి రూ. 212,040 వచ్చింది. అంటే ఇక్కడే లక్షకుపైగా లాభం అందుకున్నారు. ఇక అప్పర్ సర్క్యూట్ ధరతో చూస్తే రూ. 185.53 వద్ద అయితే.. చేతికి రూ. 222,636 వచ్చింది. ఇక్కడ లాభం రూ. 1,11,036 గా ఉంది.

ఈ సంస్థ ఐపీఓ కోసం మొత్తం 65.82 లక్షల షేర్లను ఇష్యూ చేసింది. ఏకంగా ఇన్వెస్టర్ల నుంచి 236 రెట్ల స్పందన లభించింది. NII కింద ఎక్కువగా 457 రెట్ల మేర రెస్పాన్స్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్లు 191 రెట్ల మేర సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. క్యూఐబీ కోటా కింద 168 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ జరిగింది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్, డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

About amaravatinews

Check Also

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000

ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *