తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్

తెలంగాణను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించటం లేదు. గత 10 రోజులకు పైగా.. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.

ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. పశ్చిమ భారత్‌లో రుతుపనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయని వాతావరణాశాఖ అధికారులు తెలిపారు. గుజరాత్, కేరళ దగ్గర ద్రోణి ఉందని..అరేబియా సముద్రంలోనూ ఓ తుఫాను సుడి ఏర్పడిందని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందన్నారు.

మధ్యాహ్నం 3 తర్వాత పశ్చిమ తెలంగాణ, సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. బలమైన ఈదురు గాలులు కూడా వీచే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. వర్షం కురిసే సమయంలో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.

ఇక ఉష్ణోగ్రతలు.. చూస్తే తెలంగాణలో గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుందన్నారు. ఆకాశం మేఘావృతమై ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. ఈ మేరకు శ్రీశైలం డ్యామ్‌ 10 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఈ ఇన్‌ఫ్లో ఓ 5 రోజులపాటూ వచ్చేలా ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం గేట్లు ఎత్తటంతో పర్యాటకలు భారీగా అక్కడకు చేరుకుంటున్నారు.

About amaravatinews

Check Also

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *