ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌరసరఫరాలశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్‌ బియ్యం సరఫరా, డోర్‌ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ షాపుల ద్వారా అనేక రకాల సరకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. అయితే ఆ సరకుల పంపిణీని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని.. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌరసరఫరాలశాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేశామని.. మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మార్కెట్‌లో కందిపప్పు ధర రూ.180 ఉంటే.. ప్రత్యేక కౌంటర్లలో రూ.150కు, బియ్యం కూడా కేజీ రూ.48కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని సీఎం అధికారులకు సూచించారు.

గతం ప్రభుత్వం ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ ఆలస్యం చేయడంతో రైతులు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారన్నారు చంద్రబాబు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారని.. 2019 ముందు వరకు పౌరసరఫరాలశాఖ అప్పులు రూ.21,622 కోట్లు ఉన్నాయన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వం వాటిని రూ.41,550 కోట్లకు పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.

గతంలో రేషన్ డోర్ డెలివరీ ఎండీయూ వాహనాల ద్వారా సరిగా జరగలేదన్నారు. వీధి చివర వాహనం పెట్టి అందర్నీ అక్కడికి పిలిచి రేషన్ పంపిణీ చేశారన్నారు. కానీ రేషన్‌ డోర్‌ డెలివరీ పేరుతో రూ9,260 వాహనాలను .1,844 కోట్లతో కొనుగోలు చేశారని.. కానీ రేషన్ డోర్ డెలివరీ లక్ష్యం నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో ఈ ఎండీయూ వాహణాలను బియ్యం స్మగ్లింగ్‌కు వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు. ఎండీయూ వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి.. రేషన్‌ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఇతర అంశాలపై ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు.

ఎండీయూ వాహానాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు అన్నారు. ఈ ఎండీయూ వాహనాలను త్వరలో రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎండీయూ వాహానాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్నది కసరత్తు చేయాల్సి ఉందన్నారు.

About amaravatinews

Check Also

కలుపు తీస్తోన్న గిరిజనుడిపైకి దూసుకువచ్చి చుట్టేసిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత

పొలంలో పనులు చేస్తున్న జన్ని రాము అనే గిరిజనుడిపై కింగ్ కోబ్రా అకస్మాత్తుగా దాడి చేసింది. సుమారు పది అడుగుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *