రెండేళ్లకే లక్షకు రూ.12 లక్షలు.. ఇప్పుడు 1 షేరుకు 1 షేరు ఫ్రీ.. రికార్డ్ తేదీ ప్రకటించిన కంపెనీ!

Penny Stock: స్మాల్ క్యాప్ కేటగిరి ఇంజినీరింగ్ సెక్టార్ స్టాక్ స్ప్రేకింగ్ లిమిటెడ్ (Sprayking ltd) మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది. గతంలో ఈ కంపెనీని స్ప్రేకింగ్ ఆగ్రో ఈక్విప్‌మెంట్‌గా పిలిచేవారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కొత్త ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించినట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కొత్త ప్లాంటులో కాపర్ రీసైక్లింగ్ చేపడుతోంది. హైక్వాలిటీ కాపర్ ప్రొడక్టులను తాయరు చేస్తోంది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్లకు శుభవార్త అందించింది. బోనస్ షేర్ల జారీకి సంబంధించిన రికార్డ్ తేదీని ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

బోనస్ షేర్ల జారీ..

తమ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు అందిస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది స్ప్రేకింగ్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు 1:1 రేషియోలో బోనస్ షేర్లు ఇస్తామని తెలిపింది. అందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు ఇటీవలే ప్రకటించింది. దీని ప్రకారం చూసుకుంటే రికార్డ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో ఒక ఈక్విటీ షేరు ఉన్న వారికి మరో ఈక్విటీ షేరును బోనస్‌గా అందించనుంది. అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు తాజాగా రికార్డ్ తేదీని ప్రకటించింది కంపెనీ. ఆగస్టు 14, 2024వ తేదీగా రికార్డ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ నాటికి షేర్లు కొనుగోలు చేసిన వారికి బోనస్‌గా మరో షేరు రానుంది.

రెండేళ్లలో లక్షకు రూ.12 లక్షలు

ఈ స్టాక్ ఇటీవలి కాలంలో వరుసగా పడిపోతూ వస్తోంది. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్‌‌లో చూసుకుంటే స్ప్రేకింగ్ లిమిటెడ్ స్టాక్ 0.38 శాతం నష్టంతో రూ. 36.40 వద్ద ముగిసింది. ఇక గత నెల రోజుల్లో ఈ స్టాక్ 5.87 శాతం నష్టపోయింది. గతేడాదిలో 7.17 శాతం నష్టపోయింది. ఇక గత రెండేళ్లలో చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ 1100 శాతం పెరిగింది. అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ. 12 లక్షలు అవుతుంది. అలాగే గత 5 సంవత్సరాల్లో 1738 శాతం లాభాలు అందించింది. అంటే ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ. 18 లక్షలకుపైగా ఉంటుంది.

About amaravatinews

Check Also

ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?

ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *