ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేలు, ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికి శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైఎస్సార్‌సీపీ సర్కారు రద్దు చేసింది అన్నారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని.. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు చంద్రబాబు. జీఎస్టీ తొలగించకుంటే రీయంబర్స్‌ చేస్తామని ప్రకటించారు.. నేతలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామని తెలిపారు. చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయం అందిస్తామని.. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని.. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. చేనేత పరిశ్రమను కాపాడటం బాధ్యతని.. అలాగే చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తామన్నారు. చేనేతలకు మరో హామీ ఇచ్చారు.. మరమగ్గాల కార్మికులకు, సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కూడా అందిస్తామన్నారు. చేనేతకారులకు ఆరోగ్యబీమా కల్పిస్తామని.. నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాదు చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామన్నారు.

త్వరలోనే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఉంటుంది.. ఆ పదవుల్లో బీసీలకు న్యాయం చేస్తామన్నారుచంద్రబాబు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్‌ పదవులను బీసీలకే ఇచ్చామని గుర్తు చేశారు. బీసీలకు మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించామని.. కచ్చితంా స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తామన్నారు. తమ ప్రభుత్వం కులవృత్తులే ఆస్తిపాస్తులుగా జీవిస్తున్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం.. ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోందన్నారు. బీసీల రక్షణ కోసం తమ ప్రభుత్వం చట్టం తీసుకురాబోతోందని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించామన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. పేదోడికి అండగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీయే ప్రభుత్వం ఉంటుందన్నారు.

2014-19 మధ్య చేనేత రంగానికి స్వర్ణయుగం లాంటిదన్నారు మంత్రి సవిత. గడచిన ఐదేళ్లలో దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజలకు జగన్‌ ఏమీ చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులను ఆదుకోలేదని.. పైగా వారి భూములను సైతం లాక్కున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం భూ కబ్జాలకు ప్రొద్దుటూరులో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది అన్నారు. గతంలో నూలుపై ఇచ్చిన సబ్సిడీని పునరుద్ధరించడంతో పాటు ఆప్కో ద్వారా రాయితీలు, ఆదరణ పథకాలు, నేత కార్మికులకు పెన్షన్‌, బీమా సౌకర్యం లాంటివన్నీ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తొలిసారి తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఇచ్చే సమయంలో.. ‘నా కుటుంబ సభ్యులైన చేనేతలను మీ చేతిలో పెడుతున్నా’ అని మంత్రి లోకేష్ చెప్పారని ఆ మాటలతో తాను భావోద్వేగానికి లోనయ్యాను అన్నారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *