వైసీపీ ఎమ్మెల్సీ ఇంటి ముందు కూతుళ్ల నిరసన.. మరో మహిళతో సహజీవనంపై నిరసన!

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు.. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుళ్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్‌ మోగించినా లోపలున్నవారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని.. లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు. తన భర్త తండ్రి చనిపోయినా.. తన తండ్రి శ్రీనివాస్ కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్‌ చేసినా, మెసేజ్‌లు చేసినా స్పందించడం లేదని.. గేటు లోపలి వైపు నుంచి తాళాలు వేసేశారని ఆరోపిస్తున్నారు.

తన తండ్రి మరో మహిళతో కలిసి ఉంటున్నారని.. భార్యకు విడాకులు ఇవ్వకుండా, మరో పెళ్లి చేసుకోకుండా పరాయి మహిళతో ఎలా కలిసుంటారని కుమార్తెలో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఆమెకు గతంలో వేరొకరితో వివాహమై పిల్లలున్నారని.. ఇప్పుడు తమ తండ్రిని ట్రాప్ చేసి ఇంట్లోకి ఎవరినీ రాకుండా కుట్రలు పన్నుతోందని శ్రీనివాస్ కుమార్తెలు ఆ కాల్‌లో ఆరోపించారు. తాము తండ్రితో కలిసి ఉండాలని వస్తే ఆమె అడ్డుకుంటోందని మండిపడ్డారు. పరాయి మహిళ మోజులో పడిన తండ్రి తమను పట్టించుకోవడం లేదని.. కాల్స్ చేసినా, మెసేజ్‌లు చేసినా స్పందించడం లేదని తెలిపారు.

2024 ఎన్నికలకు ఏడాది ముందు దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు రచ్చకెక్కాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. టెక్కలి వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి టెక్కలి నియోజకవర్గానికి చెందిన కొంతమందిని వెంటబెట్టుకుని జగన్‌ను కలిశారు.. ఆ తర్వాత ఆమెను టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా నియమించారు.

ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఆతర్వాత మళ్లీ టెక్కలి వైఎస్సార్‌సీపీ సీటును శ్రీనివాస్‌కు కేటాయించారు. దీంతో తాను ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేస్తున్నట్లు దువ్వాడ వాణి ప్రకటించారు. వెంటనే రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం పెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ అక్కవరం దగ్గర ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడ మరో మహిళతో కలసి ఉంటున్నట్లు కొంతకాంలో ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీను-వాణికి హైందవి, నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తమ
సంగతేమిటో తేల్చాలని కుమార్తెలు అక్కడికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్, వాణిల మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది.

దువ్వాడ శ్రీనివాస్ 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి టెక్కలి నుంచి పోటీచేసి అచ్చెన్నాయుడిపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా జగన్ పదవి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టెక్కలి నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. శ్రీనివాస్ ఇప్పుడు ఈ కుటుంబ వివాదంలో చిక్కుకోగా.. ఈ వ్యవహారంపై స్పందించాల్సి ఉంది.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *