BSNL SIM Card Online : ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ ప్లాన్‌లను 15 నుంచి 20 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో అందరిచూపు ఒక్కసారిగా ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL)పై పడింది. ఈ క్రమంలో BSNL తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగినప్పటి నుంచి BSNL కస్టమర్లను విపరీతంగా పెంచుకుంది. ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారుల కోసం BSNL కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తోంది.
ఈ క్రమంలో.. మీరు BSNL కొత్త SIM కొనుగోలు చేయాలనుకుంటే.. సంస్థ వినియోగదారుల కోసం ఒక గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. మీరు కొత్త BSNL సిమ్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు.. మీరు కొత్త సిమ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. కంపెనీ మీ ఇంటికి ఉచితంగా సిమ్‌ని డెలివరీ చేస్తుంది. మీరు పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్‌లను ఉచితంగా ఆర్డర్ చేయవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఉచితంగా BSNL సిమ్‌ని ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కూడా BSNL ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే వెంటనే కింది స్టెప్స్ ఫాలో అయిపోండి. BSNL ఉచిత SIM కార్డ్ డెలివరీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని గమనించుకోండి..
Amaravati News Navyandhra First Digital News Portal