విజయవాడ దుర్గమ్మ భక్తులకు అదిరే ఆఫర్.. ఉచితంగానే, వెంటనే దరఖాస్తు చేస్కోండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో రామరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్‌ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తుమన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్‌కు 500 మందికి మాత్రమే అనుమతి ఉందని.. ఈనెల 17 నుంచి 21 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వరలక్ష్మీ వ్రతం అనంతరం వారికి రూ.300 దర్శనం క్యూలైన్లో దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు.

శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని దుర్గమ్మను ఈనెల 16న వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతన్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. అంతేకాదు ఈనెల 17 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి 17న సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 18న ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అలాగే ఉదయం 9 గంటలకు భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఈ నెల 19న మండపారాధన, మూలమంత్ర హవనాలు, వేదపారాయణలు, హారతి, మంత్రపుష్పం నిర్వహిస్తారు. 20న ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసనతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

ఇదిలా ఉంటే.. సప్తమి తిథిని పురస్కరించుకుని దుర్గగుడిలో అర్చక బృందం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ.. వేద పండితులు, అర్చకులు సూర్యనారాయణ మూర్తికి సంకల్పం చెప్పి అరుణ పారాయణ నిర్వహించారు. సూర్యుడికి ప్రీతికరంగా సూర్ యనమస్కారాలు నిర్వహించారు. దుర్గమ్మ ఆలయ గోపుర స్వర్ణ తాపడం కోసం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంతానికి చెందిన కరణం అనంతలక్ష్మి, కుటుంబ సభ్యులు రూ.1,00,011 విరాళంగా అందజేశారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దాతలకు శే షవస్త్రం, ప్రసాదం, ఆశీస్సులు, చిత్రపటం ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ధర్మపథం వేదికపై ఆదివారం నగరానికి చెందిన పి శ్రావ్య గ్రీష్మ, శ్రీశావ్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీశ్రావ్య నర్తన, కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో జరిగిన నృత్యప్రదర్శనలో పది కీర్తనలకు చక్కని హావ, భావ ప్రదర్శనలతో నృత్యం చేసి భక్తుల్ని అలరించాయి.

మరోవైపు ఈనెల 7న దుర్గమ్మ అంతరాలయ వీడియో బయటకు రావడంతో.. భక్తులు ఆలయంలోకి మొబైల్స్ తీసుకురాకుండా నిరోధించేంందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడి దగ్గర ఉన్న మొబైల్స్‌ను కౌంటర్‌లో డిపాజిట్‌ చేయించారు అధికారులు. ఇకపై ఏ భక్తుడూ ఆలయంలోకి మొబైల్స్ తీసుకురాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటామన్నారు. గేట్ల దగ్గర విధులు నిర్వహించే సెక్యూరిటీ కూడా ప్రతి భక్తుడి వద్ద ఉన్న మొబైల్స్‌ను తీసుకెళ్లి కౌంటర్‌లో డిపాజిట్‌ చేయించాల్సిందిగా ఆదేశించారు.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *