మంత్రి నారా లోకేష్ పేరుతో డబ్బుల కావాలని మెసేజ్.. పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోటోతో గుర్తు తెలియని వ్యక్తులు మోసం చేసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు లోకేష్ ఫోటోను వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకుని డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నేత బెజవాడ నజీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ మొబైల్ వాట్సాప్‌కు మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్‌గా ఉంది.. శుక్రవారం విజయవాడలోని పటమటకు చెందిన ఆర్‌.వేణుకు ఆ వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది.

వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌లో తనను నారా లోకేష్‌కు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు.. తాను ఆంధ్రప్రదేశ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా చెప్పుకున్నాడు. తాను ముఖ్యమైన పనిలో ఉన్నానని.. తనకు అత్యవసరంగా రూ.50 వేలు డబ్బులు కావాలని.. 20 నిమిషాల్లోనే తిరిగి పంపుతానని అడిగాడు. క్యూఆర్ కోడ్ కూడా పంపించడంతో అనుమానం వచ్చింది.. వేణుకు ఈ మెసేజ్ చూసి ఎందుకో అనుమానం వచ్చింది వెంటనే టీడీపీ నేత బెజవాడ నజీర్‌కు ఈ విషయాన్ని చెప్పాడు.

నజీర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి డబ్బులు అడుగుతున్నారని.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కొందరు కేటుగాళ్లు ఇటీవల కాలంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా పలువురు కలెక్టర్లు, ఎస్పీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇలా వాట్సాప్ డీపీలతోనే అమాయకుల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి.. రోజుకో కొత్త మార్గంలో అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఆన్‌లైన్ ఆఫర్లు, లక్కీ డ్రా, బ్యాంకుల పేరుతో, పార్ట్ టైమ్ జాబ్‌లో పేరుతో గతంలో మోసాలకు పాల్పడ్డారు. తాజాగా అధికారులు, మంత్రుల పేరుతో మోసాలు మొదలు పెట్టారు. ఈ సైబర్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల జోలికి వెళ్లొద్దిన సూచనలు చేస్తున్నారు.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *