విశాఖ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం ఎంత మేర జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బీచ్ రోడ్డులో జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకొని కొందరు వ్యక్తులు ఈ డైనో పార్క్ రెస్టో కేఫ్‌ని నిర్వహిస్తున్నారు. కేఫ్ మొత్తం వెదురు బొంగులతో నిర్మించడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. అందువల్లే మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. డైనో పార్క్‌ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.
Amaravati News Navyandhra First Digital News Portal