ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు మళ్లీ వ్యక్తిగత రాయితీపై యంత్రపరికరాలు అందజేస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రైతులకు ట్రాక్టర్లు, పవర్‌స్ప్రేయర్లు, టార్పాలిన్లు, యంత్ర పరికరాలెన్నో రాయితీపై అందించనున్నారు. అలాగే ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లు కూడా అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతులు వ్యక్తిగత యంత్ర పరికరాలకు ఆదరణ చూపిస్తున్ారు.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లతోపాటు గడ్డిని కట్టలుగా కట్టే పరికరాలు, గడ్డిని ముక్కలుగా చేసే యంత్రాలలతో రైతులకు ఉపయోగపడ్డాయి. రైతులు ఈ యంత్రాలను ఉపయోగించుకోవడంతో పాటుగా ఇతరులకు అద్దె ప్రాతిపదికన ఇచ్చేవారు. ఈ యంత్రాలను సంఘానికి ఇస్తే వాటి నిర్వహణ ఎవరూ పట్టించుకోరని రైతులు చెబుతున్నారు. అంతేకాదు అన్ని పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు టార్పాలిన్లు ఎంతో అవసరం అంటున్నారు. రైతులకు ఒక్కో టార్పాలిన్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఖర్చు చేయాలి. కౌలు రైతులు అంత మొత్తం భరించలేని పరిస్థితి.. ఆర్థికంగా కూడా భారంగా మారింది. అందుకే వరి రైతులకు ఇకపై రాయితీపై టార్పాలిన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal