TCS: ఏఐతో ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయా? తగ్గుతాయా? భవిష్యత్తు సంగతేంటి? టీసీఎస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

TCS President V Rajanna: గత కొంత కాలంగా దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు నియామకాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ తగ్గిన నేపథ్యంలోనే కొత్తగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేపట్టకపోగా.. ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయన్న సంగతి తెలిసిందే. భారత దిగ్గజ ఐటీ సంస్థలు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని సంస్థల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా దీనికి ఒక కారణం. మరోవైపు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ రాకతో కూడా ఐటీ ఉద్యోగాలు తగ్గుతున్నాయని పలు నివేదికలు వస్తున్నాయి. ఇంకా.. నియామకాలపై వెనుకడుగు ఎందుకు వేస్తున్నాయి. ఇలా అన్ని అంశాలపైనా టీసీఎస్ అధ్యక్షుడు వి.రాజన్న స్పందించారు.

నియామకాలపై మాట్లాడిన ఆయన.. తమ అవసరాలకు అనుగుణంగానే సరైన సమయంలో రిక్రూట్మెంట్స్ చేసుకునేందుకు, అన్ని కాలేజీల విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించేందుకు ఐటీ సంస్థలు ప్రాంగణ ఎంపికల కంటే.. ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాజన్న చెప్పారు.

ఇంకా ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయన్న ఆందోళన అవసరం లేదని చెప్పారు. కొత్త టెక్నాలజీల వినియోగం పెరిగిన ప్రతిసారీ ఐటీ, టెక్ రంగంలో కొత్త ఉద్యోగాలు లభ్యత పెరుగుతూనే ఉందని రాజన్న అన్నారు. భారత్‌లో ఐటీ రంగం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 1970 నుంచి చూస్తే ఇంటర్నెట్, Y2K వంటి సాంకేతిక మార్పుల్ని చూసినట్లు వివరించారు. 2008 సంవత్సరంలో భారత ఐటీ రంగం 40 బి.డాలర్ల స్థాయిలో ఉంటే (రూ. 3.32 లక్షల కోట్లు) ఇప్పుడు 250 ప్లస్ బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 21 లక్షల కోట్లు) చేరిందని అన్నారు.

ఇక ఆ సమయంలో 20 లక్షల మందికి ఐటీ రంగం ఉద్యోగాలు కల్పిస్తే.. ప్రస్తుతం అది 50 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పిస్తోందని వివరించారు. కొత్త కొత్త సాంకేతికతల వల్ల మరికొన్ని అవకాశాలు పెరుగుతాయని.. అందుకు అనుగుణంగానే ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు వి. రాజన్న. ఏఐతో కూడా అధిక విలువ జోడించే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. ఏఐ.. మానవ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని.. ఈ రంగంలో కూడా అంకుర సంస్థలు ఉద్భవిస్తుండగా.. అక్కడ కూడా అవకాశాలు దొరుకుతున్నాయని అన్నారు.

ఇక భవిష్యత్తులో కూడా ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశాలే ఉన్నట్లు రాజన్న వివరించారు. టెక్నాలజీ లేనిదే ఏ కంపెనీ కూడా తమ వ్యూహాలు, వృద్ధి లక్ష్యాల్ని ఊహించే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. ప్రతి కంపెనీ కూడా పెట్టుబడులు పెడుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని చెప్పారు.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *