Mutual Funds: కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెట్టి మంచి రాబడి రావాలని అందరూ భావిస్తారు. కొందరు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. మరి కొందరు రిస్క్ ఉన్నా హైరిటర్న్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (Mutual fund) పెట్టుబడులు సరైన ఎంపికగా మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై రిస్క్ ఉన్నా.. కొన్నేళ్ల నుంచి హైరిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందులో స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబడులు అందించాయి. ఈ స్కీమ్స్ ఎంచుకున్న వారి డబ్బులను స్మాల్ క్యాప్ కేటగిరీ నుంచి షేర్లను ఎంచుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రూ.5 వేల కోట్ల కంటే తక్కువ మార్కెట్ విలువ గల కంపెనీల షేర్లు ఇందులో ఉంటాయి. అయితే, ఇతర ఫండ్లతో పోలిస్తే స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని గమనించాలి.
మార్కెట్లలో ఎప్పుడూ ఒడుదొడుకులు ఉంటూనే ఉంటాయి. చిన్న మార్పులు వచ్చినా అది స్మాల్ క్యాప్ ఫండ్లపై ప్రభావం చూపిస్తుంది. అయినప్పటికీ కొన్ని ఫండ్లు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించాయి. అందులో గత 3, 5, 10 ఏళ్లలో 17 శాతానికిపైగా రాబడి అందించిన స్మాల్ క్యాప్ ఫండ్లకు చెందిన కొన్ని స్కీమ్స్ జాబితా ఓసారి తెలుసుకుందాం. అందులో ఎల్ఐసీ, టాటా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.
- నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత 3 ఏళ్లలో 32.03 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇక 5 సంవత్సరాలలో 38.65 శాతం లాభాలు ఇవ్వగా 10 ఏళ్లలో 25.95 శాతం రిటర్న్స్ అందించింది.
- ఎల్ఐసీ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 29.42 శాతం, 5 ఏళ్లలో 32.75 శాతం, 10 ఏళ్లలో 22.96 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
- ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఏళ్లలో 26.95 శాతం, 5 ఏళ్లలో 34.58 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
- కెనరా రొబెకో స్మాల్ క్యాప్ ఫండ్ గత 3 ఏళ్లలో 27.31 శాతం, 5 ఏళ్లలో 37.41 శాతం లాభాలు అందించింది.
- టాటా స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 27.14 శాతం, 5 ఏళ్లలో 35.26 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
- హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 25.83 శాతం, 5 ఏళ్లలో 30.15 శాతం, 10 ఏళ్లలో 21.71 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ 3 ఏళ్లలో 24.32 శాతం, 5 ఏళ్లలో 31.66 శాతం, 10 ఏళ్లలో 18.53 శాతం లాభాలు ఇచ్చింది.
- ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 25.02 శాతం లాభాలు ఇవ్వగా 5 ఏళ్లలో 31.55 శాతం, 10 ఏళ్లలో 25.71 శాతం లాభాలు ఇచ్చింది.
- కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 23.42 శాతం, 5 ఏళ్లలో 35.06 శాతం, 10 ఏళ్లలో 22.80 శాతం మేర లాభాలు ఇచ్చింది.