ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్టాక్ ఇదే.. నాలుగేళ్లలోనే లక్షకు రూ. 92 లక్షలు.. ఏకంగా 9200 శాతం రిటర్న్స్!

Multibagger Stocks: సంపద సృష్టించేందుకు మనకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో రిస్క్ లేని పెట్టుబడుల కోసం అయితే చాలా మంది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇలాంటివి ఎంచుకుంటారు. ఇంకొందరు భారీ రిటర్న్స్ ఆశించి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయినప్పటికీ రిస్క్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్‌లో మంచి సంపద సృష్టించొచ్చన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. సరైన విధంగా ఆర్థిక నిపుణుల సలహాతో ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు అందిస్తుందని చెప్పొచ్చు.

ఇలా లాంగ్ రన్‌లో మంచి లాభం అందించిన స్టాక్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్. మార్కెట్లలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ఇది మాత్రం నిలకడగా రాణిస్తూ వచ్చింది. అప్ వర్డ్ ట్రాజెక్టరీలోనే కొనసాగింది. నాలుగు సంవత్సరాల కిందట ఈ షేరు ధర రూ. 9 వద్ద ఉండగా.. ఇప్పుడు అది ఏకంగా 9200 శాతానికిపైగా పెరిగి రూ. 750 లెవెల్స్‌కు చేరింది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది.

అంటే నాలుగేళ్ల కిందట రూ. 9 దగ్గర ఉన్నప్పుడు ఈ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే వారి సంపద ఇప్పుడు రూ. 93 లక్షలకు చేరేది. ఇక్కడ రూ. 92 లక్షలు లాభం వచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఈ స్టాక్ కేవలం 4 సంవత్సరాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది.

ఈ కంపెనీ ఇన్నేళ్లు అద్భుత ప్రదర్శనతోనే ఇంతలా షేరు ధర పెంచుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 2020 సంవత్సరంలో ఈ స్టాక్ 32 శాతం పెరిగింది. మరుసటి ఏడాది అంటే 2021లో ఏకంగా 905 శాతం పుంజుకుంది. 2022లో 144 శాతం, 2023లో 144 శాతం చొప్పున ఎగబాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసినా కూడా 24 శాతం పెరిగిందీ షేరు. అంటే ఈ క్రమంలో రూ. 602 నుంచి రూ. 740 కి పెరిగింది. కంపెనీ తన ఐరన్ ఓర్ మైనింగ్ కెపాసిటీని 2020లో 3 MTPA గా ఉండగా.. ఇప్పుడు 2023 నాటికి దానిని 10 MTPA కు పెంచుకుంది. ఇక దీనిని 2030 నాటికి 55 MTPA కు పెంచుకోవాలని చూస్తోంది.

ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది మెటల్స్ అండ్ మైనింగ్ కంపెనీ. ఇది ఐరన్ ఓర్ మైనింగ్ కార్యకలాపాలు సహా స్పాంజ్ ఐరన్ తయారీలో ఉంది. ఇంకా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 39.34 వేల కోట్లుగా ఉంది. 52 వారాల గరిష్ట ధర రూ. 799 కాగా.. కనిష్ట ధర రూ. 492 గా ఉంది.

About amaravatinews

Check Also

Jio 5G Voucher: జియో బంపర్ ఆఫర్.. రూ.601కే ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5జీ డేటా!

Jio 5G Voucher: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *