బిగ్‌బాస్ షో లాంఛింగ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఎనిమిదో సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 01)న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు హోస్ట్ గా నాగార్జున వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు.

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ కొత్త సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఎనిమిదో సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 01)న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు హోస్ట్ గా నాగార్జున వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. ఈసారి లిమిట్ లెస్ ఎంటర్‌టైన్మెంట్ అంటూ కొత్త సీజన్ పై బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వెళ్తున్నారో అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఇక గతంలో లాగే ఈ బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ లో స్టార్ హీరోయిన్ల డ్యాన్సు పర్ఫామెన్స్ లు, సెలబ్రిటీల ఎంట్రీలు ఉండనున్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి హీరో నాని గెస్ట్ గా రాబోతున్నాడట. గతంలో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించాడు న్యాచరల్ స్టార్. ఆ తర్వాత నాగార్జున హోస్ట్ చేస్తున్నప్పుడు కూడా పలుమార్లు బిగ్ బాస్ షోు గెస్ట్ గా వచ్చి అలరించాడు నాని. ఇప్పుడు మరోసారి సీజన్ 8 లో ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవతోంది. ఈనేపథ్యంలో తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే నాని బిగ్ బాస్ లోకి వస్తున్నాడట. దీనికి సంబంధించిన షూట్ శనివారం జరిగిందని సమాచారం .

బిగ్ బాస్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాలని షో నిర్వాహకులు గట్టిగా భావిస్తున్నారట. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ కు ‘సరిపోదా శనివారం’ టీమ్ ను ఇన్వైట్ చేశారట. ఇందుకు నాని కూడా ఓకే చెప్పారట. అంటే ఆదివారం ఎపిసోడ్ కు హీరో నానితో పాటు అందాల తార ప్రియాంక అరుల్ మోహన్, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, మరో ట్యాలెంటెడ్ యాక్టర్ ఎస్ జే సూర్య రానున్నట్లు సమాచారం. మొత్తానికి తాజా, మాజీ హోస్టులిద్దరూ బిగ్ బాస్ స్టేజిపై దుమ్ము రేపనున్నట్లు తెలుస్తోంది.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *