ఏపీ మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు రద్దు.. కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు, లోకేష్ ఐడియా అదుర్స్

ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా విజయవాడలో వరద విలయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు వరద సహాయక కార్యక్రమాలను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారుల పర్యటన, వరద సహాయక చర్యలను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల, ప్రజలకు ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమయ్యారు. వరద సహాయకచర్యలు, బాధితులకు భోజనం అందించడం వంటి అంశాలపై చర్చించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. లోకేష్ ప్రతిపాదనకు మంత్రులు అంగీకరించారు.. వరద పరిస్థితుల్ని గమనించి.. మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు సహాయ కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. చివరి బాధితులకు ప్రభుత్వ సాయం అందేందుకు వీలుగా మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు, భోజనం, త్రాగునీరు అందించే వాహనాలకు ఎస్కార్ట్‌గా మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు వెళ్లనున్నాయి. లోకేష్ మంచి ఐడియా ఇచ్చారని తోటి మంత్రులు అభినందించారు. సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, అధికారులు పర్యటిస్తున్నారు. వరదనీటితో ఒలేరు కట్ట నిండుతుండటాన్ని గమనించి.. కట్ట రక్షణకు చర్యలు తీసుకున్నారు. రాత్రి మొత్తం కట్ట మీదే ఉంటూ పనులు పర్యవేక్షించారు.. గండి పడుతుందేమో అని, అన్ని విధాలుగా సిద్ధం అయ్యారు. కానీ ఇంతలోనే వరద ప్రవాహం తగ్గటంతో ఊపిరి పీల్చుకున్నారు. రేపల్లె పట్టణ ప్రజలు దాదాపుగా సేఫ్ అని.. మరో రోజు గడిస్తే ప్రమాదం తప్పినట్లేనని మంత్రి అనగాని అన్నారు. రేపల్లె మండలంలో గల వరద ప్రభావిత ప్రాంతాలు పెనుమూడి, రావి అనంతవరం, ఒలేరు గ్రామాల్లో మంత్రులు పర్యటించారు. కూటమి కార్యకర్తలు, అధికారులు కష్టపడి ఓలేరు కట్టను రక్షిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అవసరమైతే ఒలేరు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామని.. రేపల్లె ప్రజలు సురక్షితంగా ఉండాలన్నారు.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *