ఆ 185 మంది దగ్గరే రూ. 100 లక్షల కోట్లు.. ఈ డేటా చూస్తే మైండ్ బ్లాంక్.. టాప్-10 లో ఒకే మహిళ!

Ambani Adani Wealth: ప్రపంచ దేశాల్లో.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి రేటు ఇతర చాలా దేశాలతో పోలిస్తే ఘనంగా ఉందని చెప్పొచ్చు. ఇదే సమయంలో.. భారత్‌లో సంపన్నుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో నికర సంపద ఒక బిలియన్ డాలర్లకు (రూ. 8400 కోట్లు) పైగా సంపద ఉన్న వారి సంఖ్య 185 ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ మొత్తం 185 మంది నికర సంపద ఒక ట్రిలియన్ డాలర్ కంటే చాలా ఎక్కువట. ఇది దాదాపు రూ. 100 లక్షల కోట్లకు సమానం అని చెప్పొచ్చు. అంటే దేశంలోని అత్యంత సంపన్నులైన 185 మంది దగ్గరే.. రూ. 100 లక్షల కోట్ల వరకు డబ్బులు ఉన్నట్లు ఫార్చ్యూన్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది.

ఇక గత మూడేళ్ల వ్యవధిలో దేశంలో అత్యంత సంపన్నుల సంఖ్య 50 శాతానికి మించి పెరిగిందని రిపోర్ట్ స్పష్టం చేసింది. సరిగ్గా ఈ 185 మంది బిలియనీర్లందరి నికర సంపద 1.19 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత కరెన్సీలో చూస్తే రూ. 99.96 లక్షల కోట్లుగా ఉంది. దాదాపు అటుఇటుగా రూ. 100 లక్షల కోట్లన్నమాట. 2022 నుంచి చూస్తే.. ఈ డాలర్ బిలియనీర్స్ సంఖ్య 142 నుంచి 185కు పెరిగింది.

ఈ మొత్తం 185 మంది సంపద భారతదేశ జీడీపీలో దాదాపు 33.81 శాతానికి సమానం. ఈ ఏడాది కొత్తగా ఈ లిస్టులో 29 మంది స్థానం సంపాదించుకున్నారు. వీరిలో జోహో కార్పొరేషన్‌కు చెందిన శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబు, రాధా వెంబు ఉన్నారు. అగర్వాల్ కోల్ కార్పొరేషన్‌కు చెందిన వినోద్ కుమార్ అగర్వాల్, ఉపర్ ఇండస్ట్రీస్ నుంచి కుశాల్ నరేంద్ర దేశాయ్, చైతన్య నరేంద్ర దేశాయ్; శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ నుంచి మహబీర్ ప్రసాద్ అగర్వాల్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నషనల్‌కు చెందిన శివ్ రతన్ అగర్వాల్, దీపక్ అగర్వాల్ వంటి వారు ఉన్నారు.

ఫార్చ్యూన్ అత్యంత సంపన్న భారతీయుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ టాప్‌లో ఉన్నారు. ఈయన నికర సంపద 125.15 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాత అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 123.9 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుసగా షాపూర్‌జీ మిస్త్రీ అండ్ ఫ్యామిలీ (43.47 బిలియన్ డాలర్లు), సావిత్రి జిందాల్ (33.06 బి.డాలర్లు), శివ్ నాడార్ (32.85 బి.డాలర్లు) రాధాకిషన్ దమానీ (30.31 బి.డాలర్లు), దిలీప్ సంఘ్వీ అండ్ ఫ్యామిలీ, సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ, అజీమ్ ప్రేమ్‌జీ, ఆది గోద్రేజ్ అండ్ ఫ్యామిలీ వరుసగా ఉన్నారు. ఇక టాప్-10 సంపన్నుల్లో ఒకే ఒక మహిళ జిందాల్ ఉన్నారు.

About amaravatinews

Check Also

ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి యూపీఐ చెల్లింపులు.. రూ. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌

దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిదే. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *