ఏపీలోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఆగనుంది. ఈ మేరకు వందేభారత్ హాల్ట్‌కు రైల్వే సహాయ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి దుర్గ్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు పట్టాలెక్కబోతోంది. అయితే పార్వతీపురంలో స్టాప్ లేకుండానే రైల్వే అధికారులు ఈ వందేభారత్ రైలు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే ఈ రైలుకు పార్వతీపురం, టౌన్ రైల్వే స్టేషన్‌ల్లో నిలుపలేదు. వెంటనే స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర విశాఖపట్నంలోని డీఆర్‌ఎంతో పాటుగా అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాదు రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్నను బెంగళూర్‌లో కలిసి సమస్యను వివరించారు. దీంతో పార్వతీపురంలో వందేభారత్ హాల్ట్‌పై రైల్వే సహాయ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అదే జరిగితే పార్వతీపురంలో కూడా వందేభారత్ రైలు ఆగనుంది.
Check Also
నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!
నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …