మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అప్పటి నుంచి లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.107.41 వద్ద కొనసాగుతోంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.95.65 వద్ద స్థిరంగా ఉంది. ప్రాంతాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో కాస్త తేడాలు ఉంటాయి.
Amaravati News Navyandhra First Digital News Portal