ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో పథకం అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.. నూతన మద్యం విధానం, వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
సూపర్స్ సిక్స్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద డబ్బుల్ని జమ చేయనుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి, మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ పథకం మార్గదర్శకాలు, అమలుపై ప్రధానంగా కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలలో.. ఈ ఆడ బిడ్డ నిధి హామీ కూడా కీలకమైనది. ఎప్పటి నుంచో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు.. తాజాగా మార్గదర్శకాలపై కసరత్తు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మార్గదర్శకాలను సిద్ధం చేసి.. పథకాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు.
ప్రాథమికంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి.. 18 ఏళ్లు వయసు దాటి ఉండాలని.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి నిధులు జమ చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా.. ప్రతి నెలా లబ్ధిదారులకు రూ.1500 చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాకు డబ్బుల్ని జమ చేస్తారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.