ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి వినియోగానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం కేంద్రానికి పంపడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధుల్ని కేంద్రం విడుదల చేసింది.

పంచాయతీల ఖాతాల్లో డబ్బులు లేకుండాపోయాయి.. దీంతో స్థానికంగా పనులు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, కమిషనర్‌ కృష్ణతేజ చొరవ తీసుకున్నారు. గ్రామ పంచాయతీలకు సుమారు రూ.2వేల కోట్లు వ చినట్లయిందని.. ఈ నిధులు జమ తర్వాత పంచాయతీల్లో చేపట్టే పనులపై నిఘా ఉంటుంది అన్నార కమిషనర్‌ కృష్ణతేజ. దీనికి సంబంధించి ఒక పోర్టల్‌ను రూపొందించామని.. ఇప్పటికే రెండు పంచాయతీల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేశామన్నారు. ఈ పోర్టల్‌ను త్వరలో అమల్లోకి తెచ్చి పంచాయతీల్లో లెక్కలు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేస్తే అధికారులతో పాటు సర్పంచ్‌లపైనా చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్‌ హెచ్చరించారు. కేంద్రం నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాతే ఆర్థిక సంఘం నిధులకు మోక్షం కలిగింది అన్నారు.

మరోవైపు ఏపీ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి.. ఢిల్లిలో కేంద్ర రహదారులు, రవాణశాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై వివిధ కారణాలతో ఆగిన జాతీయ రహదారుల నిర్మాణపనులను వేగంగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. జనార్దన్‌రెడ్డి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడితో కలిసి గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతేకాదు కేంద్ర రహదారి మౌలికవసతుల నిధి కింద పంపిన రూ.350 కోట్ల ప్రతిపాదనలను ఆమోదించాలని కోరగా.. గడ్కరీ సమ్మతించడంతోపాటు మరో రూ.150 కోట్ల విలువైన పనులకు అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.186 కోట్లతో అంచనాలు రూపొందించామని.. రోడ్లపై గోతులు పూడ్చటానికి రూ.296 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు మంత్రి జనార్దన్‌రెడ్డి.

About amaravatinews

Check Also

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్‌గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *