ఏపీలో రేపటి నుంచి కొత్త కార్యక్రమం.. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. “ఇది మంచి ప్రభుత్వం” పేరుతో కొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 6రోజుల పాటు ఈ “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేసిన అభివృద్ధి, పనులను తమ తమ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు తిరిగి ప్రచారం చేయనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు.. రేపు(శుక్రవారం) శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడి నుంచే “ఇది మంచి ప్రభుత్వం” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు 6 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటిస్తోందని చంద్రబాబు తెలిపారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ అని వెల్లడించారు. గత ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధ, అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం ఇది అని తెలిపారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని.. దీనికి సంబంధించిన లోగోని షేర్ చేస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. గత 100 రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రగతిని రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించడంతోపాటు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పి కొట్టేలా ప్రజలను చైతన్యం చేసే దిశగా సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నట్లు ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజాపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు చెప్పారు. గ్రామంలోని పలువురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితోనూ స్వయంగా సీఎం మాట్లాడుతారని పేర్కొన్నారు.

About amaravatinews

Check Also

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *