దిన ఫలాలు (సెప్టెంబర్ 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రులకు సహాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
భాగ్య, ఉద్యోగ, లాభ స్థానాధిపతులు బాగా బలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. చదువుల విషయంలో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
లాభ, చతుర్థ, పంచమ స్థానాలు పటిష్ఠంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతితో పాటు నాలుగు, అయిదు స్థానాల అధిపతులు బాగా అనుకూలంగా ఉండడంతో కొన్ని సమస్యలు, వివాదాల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రులకు సహాయపడతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ, ధన, చతుర్థ స్థానాలు శుభ గ్రహాలతో ఉన్నందువల్ల ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారులకు రాబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ, లాభ, ధన స్థానాల్లో అనుకూల గ్రహాలు ఉన్నందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలకు సంబం ధించిన శుభవార్తలు వినడం, అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం కావడం వంటివి జరుగు తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారా లను పూర్తి చేసి, ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా పుంజుకుంటాయి. ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ధన, భాగ్య, షష్ట స్థానాలు బలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు కొత్తగా ఆఫర్లు అందు తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. మిత్రుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి బలంగా ఉండడం వల్ల రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగంలోప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా కొనసాగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
సప్తమ, దశమ, లాభస్థానాలు పటిష్టంగా ఉన్నందువల్ల, ఎటువంటి సమస్యలు, ఆటంకాలు ఎదు రైనా దూసుకుపోతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ప్రతి పనినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులను మీ పని తీరుతో మెప్పిస్తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. రావ లసిన డబ్బు, బాకీలను వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయ, దశమ, లాభస్థానాలు బలంగా ఉన్నందువల్ల, నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ధన, పంచమ, భాగ్య, దశమ స్థానాల్లో అనుకూల గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో వేతనాలు పెరుగుదలకు, పదోన్నతికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఆర్థిక సమస్యలను అధిగమించి లాభాల బాటపడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయా నికి లోటుండకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
చతుర్థ, సప్తమ స్థానాల్లో శుభ గ్రహాలు ఉన్నందువల్ల, కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థితి పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోక పోవడం మంచిది. బంధుమిత్రుల కారణంగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యు లతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి, చతుర్థ స్థానం బలంగా ఉండడం వల్ల ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది. తండ్రి నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు పురోగతి చెందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.