విజయవాడలో ఓ దొంగ ఆట కట్టించారు పోలీసులు. కొద్దిరోజులుగా నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. మనోడి గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మనోడు రాత్రిళ్లు చోరీలు చేయడం.. దానికి కూడా టైమింగ్స్ ఉంటాయి.. మనోడి ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. మహంతిపురంకు చెందిన షేక్ షబ్బీర్‌బాబు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు.. జల్సాల కోసం డబ్బులు కావాలి.. అందుకే విజయవాడలో దొంగతనాలు మొదలుపెట్టాడు. దీని కోసం ముందుగానే ఓ ప్లాన్ వేసుకుంటాడు.
విజయవాడలో పగటి పూట తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే ఎంచుకుంటాడు.. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి దొంగతనాలు చేస్తాడు. మనోడిపై రౌడీ షీట్ కూడా ఉండటంతో.. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. షబ్బీర్ కోసం పోలీసులు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టగా నగరంలోని కోమల సెంటర్ దగ్గర అరెస్ట్ చేశారు. అంతేకాదు నిందితుడి దగ్గర నుంచి సుమారు రూ.4 లక్షలు విలువచేసే 180 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మనోడిపై గడిచిన రెండేళ్లలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, మొత్తం 7 చోరీలకు పాల్పడినట్లు తేలింది. అంతేకాదు మనోడ దొంగతనం చేసే విధానం కూడా వేరేగా ఉంటుంది. పగటి సమయంలో మాత్రమే చోరీలు చేస్తుంటాడు.. రాత్రిళ్లు దొంగతనాలకు అసలు వెళ్లడు.
Amaravati News Navyandhra First Digital News Portal