తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక రైలు పొడిగింపు, ఈ రూట్‌లోనే

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ప్రత్యేక రైలును డిసెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోలాపూర్‌-తిరుపతి-సోలాపూర్‌(01437/01438) మధ్య ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు రాయలసీమ మీదుగా నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు గడువును డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ సోలాపూర్‌-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా.. ట్రైన్‌ ఆన్‌ డిమాండ్‌ ఉండడంతో డిసెంబరు 26వ తేదీ వరకు.. తిరుపతి- సోలాపూర్‌ నడుమ (04138) నడిచే రైలును ఈనెల 27వ తేదీ వరకు నడపాల్సి ఉండగా.. డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి కావడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. విజయవాడలో రైల్వే అభివృద్ధి పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు ఆయనకు వివరించారు. ప్రధానంగా కోటిపల్లి, నరసాపురం కొత్త రైల్వే లైన్‌‌పై చర్చ జరిగింది. అమలాపురం, నరసాపురం ప్రాంతాల్లో చేపట్టిన పనులు, వంతెనల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకొని పనులను వేగవంతం చేయాలని అధికారులకు కేంద్రమంత్రి సూచించారు.

మొగల్తూరు– బంటుమిల్లు మీదుగా మచిలీపట్నం వరకు కొత్త రైల్వేలైన్‌పై అధికారులు ఫోకస్ పెట్టారన్నారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు, భూసేకరణ, ప్రయాణికుల రద్దీ, ఇతర రూట్లలోని మార్గాలతో అనుసంధానంపై రైల్వేశాఖ ప్రాథమిక సర్వే చేసిందన్నారు. మరో 15 రోజుల్లో ఈ నివేదిక ఢిల్లీలోని రైల్వే బోర్డుకు చేరుతుందని.. ఆ తర్వాత ప్రాజెక్ట్ క్లియరెన్స్ వస్తుందన్నారు. అలాగే వారణాసికి వెళ్లేందుకు ప్రత్యేక రైలు లేదని.. ఒక రైలు విశాఖపట్నంనుంచి నడుస్తున్నా విజయనగరం జిల్లా వాసులకే తప్ప మిగిలిన జిల్లాలవారికి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. నరసాపురం నుంచి మరో రైలును నడపాలని రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పారు. ఇక్కడి నుంచి అయితే ఉభయగోదావరి జిల్లా వాసులతో పాటు కృష్ణా, గుంటూరు ఇతర జిల్లా వాసులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. అలాగే నరసాపురం నుంచి వందే భారత్‌ నడపాలని.. చెన్నై విజయవాడల మధ్య నడుస్తున్న వందే భారత్‌ నరసాపురం, భీమవరం వరకు పొడిగించాలని విన్నవించామన్నారు. నరసాపురం నుంచి ప్రతి ఆదివారం హైదరాబాద్‌కు నడిచే స్పెషల్, వీక్లీ బెంగళూరు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేయాలని కోరామన్నారు. దీనిపై మరో మూడు నెలల్లో క్లారిటీ వస్తుందన్నారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *