LIC సంచలన నిర్ణయం.. ఇక రోజుకు రూ.100 చాలు.. అక్టోబర్ 7లోపే అమలులోకి!

LIC: ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో చిన్న మదుపరులను ఆకర్షించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పెట్టుబడిదారులకు తమ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. త్వరలోనే రోజుకు రూ.100తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ రవి కుమార్ ఝా ఓ సమావేశంలో తెలిపారు.

ప్రస్తుతం రోజుకు పెట్టుబడి కనీస పరిమితి రూ.300గా ఉంది. నెలవారీ సిప్ పెట్టుబడి రూ.1000 నుంచి రూ.200లకు తగ్గిస్తామని ఎల్ఐసీ ఎంఎఫ్ ఎండీ రవి కుమార్ తెలిపారు. ఈ కొత్త మార్పులు వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీలోపు అమలులోకి తీసుకొస్తామని తెలిపారు. చిన్న వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, కిరాణా దుకాణదారులూ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. నెలకు రూ.250తో సిప్ పెట్టుబడిని అందుబాటులోకి తెస్తామని ఇటీవలే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు ఎండీ రవి కుమార్. ప్రస్తుతం ఉన్న 35 బ్రాంచీలను 50కి పెంచో ఆలోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా మాన్యుఫాక్చరింగ్ ఫండ్ అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో కనీసం రూ.5 వేలతో లంప్‌సమ్ పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ సహా రెండు ఈటీఎఫ్ ఫండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు రూ.100తో సిప్ పెట్టుబడి అవకాశం కల్పించడం ద్వారా చిన్న మదుపరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మంది ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *