శాంసంగ్‌ ఆఫర్ల జాతర.. భారీ డిస్కౌంట్లతో లభించే స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వాషింగ్‌మెషీన్లు, ఫ్రిజ్‌లు ఇవే!

Samsung Fab Grab Fest Sale 2024 : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ (Fab Grab Fest) సేల్ ప్రకటించింది. ఈ ఫెస్ట్ సేల్‌లో భాగంగా సెలెక్టెడ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, గెలాక్సీ బుక్స్, టాబ్లెట్లు, టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. ఈనెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్లపై గరిష్టంగా 53 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. శాంసంగ్ వెబ్ సైట్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ఈ ఆఫర్లు పొందొచ్చు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ లు, మానిటర్లపైనా విస్తృత శ్రేణి డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతోపాటు సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ 40 శాతం వరకూ అంటే గరిష్టంగా రూ.15 వేల వరకూ అదనపు రాయితీ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐలతోపాటు సెలెక్టెడ్ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై స్మార్ట్ టీవీలు కొనుగోలు చేస్తే 22.5 శాతం (గరిష్టంగా రూ.25 వేలు) వరకు క్యాష్‌బ్యాక్‌ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్‌/ డెబిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసిన వారు ఈ తగ్గింపు పొందొచ్చు. గెలాక్సీ బుక్‌4 సిరీస్‌పై 27శాతం తగ్గింపు అందిచనుంది. గెలాక్సీ బుక్‌ 4 మోడల్‌ కొనుగోలు చేసిన వారికి హెచ్‌డీ ఫ్లాట్‌ మానిటర్‌పై రూ.1,920 తగ్గింపు ఇవ్వనుంది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ9, ఎస్‌9 సిరీస్‌లపై గరిష్ఠంగా 74శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. వినియోగదారులు ఆఫర్ల వివరాలు తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

డిస్కౌంట్‌ లభించే స్మార్ట్‌ఫోన్లు ఇవే

  • శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6
  • శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫిలిప్ 6
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్
  • శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ
  • శాంసంగ్ గెలాక్సీ ఏ55
  • శాంసంగ్ గెలాక్సీ ఏ35
  • శాంసంగ్ గెలాక్సీ ఎం35
  • శాంసంగ్ గెలాక్సీ ఎం15
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15

ఆఫర్ల ఉన్న టీవీలు ఇవే

  • శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ 8కే
  • శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ
  • శాంసంగ్ క్యూఎల్ఈడీ
  • శాంసంగ్ క్రిస్టల్ 4కే యూహెచ్‌డీ
  • శాంసంగ్ ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్
  • శాంసంగ్ ది ఫ్రేమ్
  • సెలెక్టెడ్ శాంసంగ్ 55 అంగుళాలు/ అంతకంటే పెద్ద టీవీలు
  • సెలెక్టెడ్ శాంసంగ్ 32 అంగుళాలు/ అంతకంటే పెద్ద టీవీలు

గమనిక: ఇది ఎలాంటి ప్రమోషన్‌ న్యూస్‌ కాదు. వినియోగదారులు పూర్తి వివరాలను, ఆఫర్లను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయడం మంచిది.

About amaravatinews

Check Also

పసిడి ప్రియులకు ఎగిరి గంతేసే న్యూస్.. దిగొచ్చిన ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

మగువలు పసిడి ప్రియులు. పండగలు, ఫంక్షన్లకు ఒంటినిండా బంగారు నగలు ధరించి మురిసిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *