తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని టీటీడీ సూచించింది. తిరుపతి అలిపిరి పాదాల మండపం దగ్గర గోశాల ప్రక్కన భక్తుల సౌలభ్యం కొరకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసేందుకు తాత్కాలిక షెడ్లు, క్యూ లైన్లు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న పాదాల మండపంం మెట్ల దారి యథావిధిగా ఉంటుంది అన్నారు. అయితే ఒక వ్యక్తి అక్కడ నుంచి మెట్ల మార్గానికి ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇకపై అలిపిరి పాదాల మండపం మార్గం కనుమరుగు అవుతుందని.. భక్తులను తప్పు దోవ పట్టించేలా వీడియో ద్వారా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా లో ప్రచారం చేయడం మంచి పద్దతి కాదు అన్నారు. భక్తులు ఇటువంటి వార్తలను నమ్మొద్దని కోరింది టీటీడీ.
Check Also
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …