ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ప్రాజెక్టును తక్కువ బిడ్డింగ్ చేసి దక్కించుకున్నట్లు తెలిపింది. ఒడిశాలో నిర్మాణ పనుల ప్రాజెక్టుగా తెలిపింది. ఈ ఆర్డర్ విలువ రూ. 283.69 కోట్లుగా ఉంటుందని తెలిపింది. రానున్న 24 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ మేరకు స్టాక్స్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఇవాళ మార్కెట్ ముగిసిన తర్వాత విషయం వెలుగులు లోకి వచ్చింది. ఈ క్రమంలో వచ్చే ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.283 కోట్ల కొత్త ఆర్డర్లో భాగంగా జరపాడ నుంచి తల్చెర్ రోడ్ వరకు మూడో, నాలుగో లైన్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అలాగే అంగల్- బల్రామ్ మధ్య కొత్త లైన్ నిర్మాణం చేయాలని ఆర్వీఎన్ల్ తెలిపింది. భూమి చదును పనులు, చిన్న బ్రిడ్జులు, ప్రధాన వంతెనలు, లికింగ్ వర్కులు, ఎస్‌అండ్‌టీ భవనాలు, లెవల్ క్రాసింగులు వంటివి ఇందులో ఉంటాయని తెలిపింది. అయితే, జరపాడా నుంచి తల్చెర్ మధ్య పనుల్లో స్టేషన్ యార్డ్స్ లేవని తెలిపింది. ఆర్వీఎన్ఎల్ అనేది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది. ఈ సంస్థకు గతఏడాదిలోన్ నవరత్న హోదా లభించింది. నవర్నత కంపెనీలకు స్వతంత్రంగా రూ.1000 కోట్ల వరకు పెట్టబడులు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థను జనవరి 24,2003లో ఏర్పాటు చేశారు. సెప్టెంబర్, 2013లో మినీరత్నగా అవతరించింది.
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.1.13 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.647 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.142.15 వద్ద ఉంది. పీఈ రేషియో 75.30గా ఉంది. డివిడెండ్ యీల్డ్స్ 0.40 శాతంగా ఉన్నాయి. ఈ స్టాక్ మంగళవారం నాటి ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ప్రారంభించిన చివరకు నష్టాల్లో ముగిసింది. గత ఐదు సెషన్లలో ఈ స్టాక్ 0.80 శాతం లాభపడింది. గత నెల రోజుల్లో 13 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో చూసుకుంటే మాత్రం 100 శాతం పెరిగి ఇన్వెస్టర్ల సొమ్మును రెండింతలు చేసింది. ఇక ఈ ఏడాది 2024లో ఈ 9 నెలల్లో 188 శాతం లాభాలు అందించింది. గత ఏడాదిలో చూసుకుంటే 204 శాతం లాభాలు ఇచ్చింది. గడిచిన 5 సంవత్సరాలలో ఈ స్టాక్ 2181 శాతం పెరిగింది. ఐదేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టి షేర్లు కొన్నట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.21.81 లక్షలకుపైగా ఉంటుంది.