విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే

విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని ఆరు ప్రదేశాలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించగా.. వాటిలో జబల్‌పూర్‌ జియోపార్కు, సిక్కిం మామెలిలో పోషిల్‌ పార్కు, కేరళ వరకల జియోపార్కు, రాజస్థాన్‌లో రామగర్‌ జియోపార్కు, లద్దాఖ్‌లో లామయూరు మ్యూజియం, విశాఖపట్నం అర్బన్‌ జియో పార్కులు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో- జీఎస్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో జియో పార్కుల అంశంపైనా చర్చ జరిగింది. యునెస్కో ప్రతి ఏటా ఒక దేశానికి చెందిన రెండు ప్రదేశాలకు మాత్రమే గుర్తింపు ఇస్తుంది.

విశాఖపట్నంను జియోపార్కుగా గుర్తించాలంటే యునెస్కో నిర్దేశించిన మోడల్ సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎర్రమట్టిదిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించేందుకు ఇంటాక్‌ సంస్థ కృషి చేసింది. వీరు జీఎస్‌ఐతో పోరాడి గుర్తింపు తీసుకువచ్చారు. ఎర్రమట్టి దిబ్బలతో పాటుగా విశాఖపట్నం పరిసరాల్లో మరికొన్ని పురాతన ప్రదేశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఇంటాక్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో జియోపార్కులపై నివేదిక కూడా సమర్పించారు.

ఢిల్లీలో జరిగిన సమావేశంలో.. మన దేశం నుంచి ప్రతిపాదించిన ఆరు ప్రదేశాలలో విశాఖకు వేల ఏళ్ల చరిత్ర ఉందని నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ సంస్థ ప్రతిపాదించింది. విశాఖకు జియోపార్కుగా గుర్తింపు లభిస్తే పర్యాటకపరంగా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. అక్కడి ప్రముఖ స్థలాలను ఒకే గొడుగు తీసుకొచ్చి..ఒక అథారిటీ ఏర్పాటుచేసి కార్యకలాపాల నిర్వహణకు వీలుంటుంది అంటున్నారు. విశాఖపట్నం ఎన్నో ఏళ్లకు చరిత్ర కలిగిన భౌగోళిక వైవిధ్యం ఉన్న ప్రాంతం అంటున్నారు. అక్కటి బొర్రా గుహలు, బౌద్ధారామాలైన తొట్లకొండ, ఎర్రమట్టిదిబ్బలు, బావికొండ, బొజ్జన్నకొండ వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఎంతో చరిత్ర ఉంది.ఇక విశాఖ సముద్ర తీరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశాఖపట్నం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలకు ఘన చరిత్ర ఉండగా.. ఈ స్థలాన్ని భౌగోళిక వారసత్వ సంపదగా జియోజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. బొర్రాగుహలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది.. సింహాచలం దేవాలయం, పాత నగరంలో వారసత్వ కట్టడాలు ఉన్నాయి.

విశాఖపట్నం అర్బన్‌ను జియోపార్కుగా యునెస్కో గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కుతుందంటున్నారు. అప్పుడు విశాఖపట్నంకు ఇతర దేశాల నుంచి ఎక్కువమంది పర్యాటకులు వస్తారని.. అప్పుడు ఈ ప్రాంతం భౌగోళిక వారసత్వ సంపద, పురావస్తు చరిత్ర, విశిష్టతకు ప్రాచుర్యం లభిస్తుంది అంటున్నారు. అప్పుడు పెద్దఎత్తున ఉపాధితో పాటు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో విశాఖ నగరానికి స్వచ్ఛబాగీదారి అవార్డు దక్కంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు.ఈ అవార్డు నగర ప్రజలకు అంకితం చేస్తున్నామని.. స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికుల సహకారంతోనే ఈ అవార్డు దక్కిందన్నారు కమిషనర్.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *