మంత్రి కొండా సురేఖ వివాదం.. కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదు

ప్రస్తుతం తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టే రాజకీయం నడుస్తోంది. అయితే.. ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైంది. గురువారం (అక్టోబర్ 03న) రోజు హైదరాబాద్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు.. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో.. స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఆమెకు స్వాగతం పలుకుతూ చేనేతలు ప్రత్యేకంగా తయారు చేసిన నూలుపోగు దండాను వేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను కొందరు బీఆర్ఎస్ మద్దతుదారులు.. ద్వందార్థం వచ్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై తీవ్రంగా స్పందించిన కొండా సురేఖ.. భావోద్వేగానికి లోనయ్యారు. భోజనం తినకుండా.. నిద్ర కూడా పోకుండా బాధపడుతూనే ఉన్నానని చెప్తూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక.. ఇదే అంశంపై స్పందించిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్ శ్రేణులపై తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ పోస్టులు పెట్టిన వారిని, వాటికి అసభ్యకరంగా కామెంట్లు పెట్టిన ఎవ్వరినీ వదలిపెట్టేది లేదంటూ హెచ్చరించారు. అయితే.. ఆ పోస్టులు పెట్టిన వాళ్లు, కామెంట్లు పెట్టిన వారిలో చాలా మంది హరీష్ రావు, కేటీఆర్ ఫోటోలనే డీపీలుగా పెట్టుకున్నారంటూ.. ఆరోపించారు.

ఒక తమ్ముడిగా.. కొండా సురేఖకు అండగా ఉంటానని.. వకీలుగా ట్రోలింగ్ చేసిన వారందరిపై కేసులు నమోదు చేపిస్తానని రఘునందన్ తెలిపారు. అసభ్యకర పోస్టులు పెట్టింది ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన రఘునందన్ రావు.. దుబ్బాక, సిద్దిపేట పోలీసులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. తాజాగా సైబర్ క్రైం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయటంతో.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా నడుస్తున్న సమయంలోనే.. అక్టోబర్ 02న తాజాగా.. నాగచైతన్య, సమంతల విడాకుల గురించి తీవ్రమైన ఆరోపణలు చేయగా.. వాటిపై ఇటు రాజకీయాల్లోనూ అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తీవ్ర దుమారం చెలరేగుతోంది. టాలీవుడ్‌ ప్రముఖులంతా కొండా సురేఖ చేసిన ఆరోపణలను ముక్తకంఠంతో.. ఖండిస్తున్నారు. అంతేగాక.. సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు.

About amaravatinews

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *